Small Investment Big Returns : అలా పొదుపు చేసిన డబ్బులను మంచి రాబడి ఇచ్చే పథకాలలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. ఈ క్రమంలో నెలకు కనీసం రూ.100 సిప్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా మీరు భవిష్యత్తులో కోటి రూపాయలు నిధిని సృష్టించుకోవచ్చు. కాంపౌండింగ్ పవర్ కారణంగా ఇది సాధ్యమవుతుంది అని చెప్పొచ్చు. సరైన క్రమశిక్షణతో మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో నెలకు కేవలం 100 రూపాయలు పెట్టి అద్భుతమైన రాబడిని పొందవచ్చు. ఇది నిజంగా అద్భుతమైన ప్లాన్ అని చెప్పడంలో సందేహం లేదు. ఆర్థికంగా ఎదగాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. కానీ ఏ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్లాన్ లో ఎక్కువ రాబడి ఉంటుంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. సరైన పథకంలో పెట్టుబడి పెట్టడం వలన దీర్ఘకాలంలో మీరు ఆశించిన రాబడిని పొందవచ్చు. క్రమశిక్షణతో దీర్ఘకాలం పాటు సరైన పథకంలో పెట్టుబడి పెట్టడం అనేది అసలు రహస్యం అని చెప్పాలి.
Also Read : రైతులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు.. భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..
మీరు కేవలం రూ.100 ప్రతినెల సిప్ చేయడం ద్వారా 48 సంవత్సరాల తర్వాత మీరు ఒక కోటి రూపాయలు నిధిని పొందవచ్చు. మన దేశ ఈక్విటీ మార్కెట్లో గడిచిన 35 నుంచి 40 ఏళ్లుగా సగటున 15% వార్షిక రాబడినీ ఇస్తున్నాయి. ఇదే కనుక కొనసాగినట్లయితే మీరు అనుకున్న లక్ష్యం చేరుకోవడం చాలా సులభం. మన దేశ ఆర్థిక అభివృద్ధిని భవిష్యత్తులో చూసినట్లయితే రాబోయే దశాబ్దాలలో కూడా ఇటువంటి రాబడులను ఆశించవచ్చు. ఈ మొత్తం సాధ్యం అవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే కాంపౌండింగ్ పవర్. కాంపౌండింగ్ అంటే వడ్డీ పై వడ్డీ. అంటే మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత అసలు పై వచ్చే వడ్డీ కూడా ఆ తర్వాత పెట్టుబడిగా మారుతుంది. దీనిపై మళ్లీ వడ్డీ లెక్కించబడుతుంది.
ఆ తర్వాత ఆ వడ్డీ కూడా అసలుకు జమ చేయబడుతుంది. ఈ విధంగా వడ్డీ పై వడ్డీ పెరిగి మీ రాబడి వేగంగా పెరుగుతుంది. ఎక్కువ ఏళ్ళు గడిచేకొద్దీ మీరు రాబడి చాలా వేగంగా పెరుగుతుంది. మీరు ఎంత త్వరగా సిప్ లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే దీర్ఘకాలంలో మీరు పెద్ద మొత్తంలో రాబడి పొందే అవకాశం ఉంటుంది. మనలో చాలామంది ఏ ప్లాన్లో పెట్టుబడి పెట్టాలో తెలియక సరైన సమయం కోసం అలాగే బెస్ట్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ కాలాన్ని వృధాగా గడిపేస్తారు. తెలివైన వ్యూహం ఏంటంటే తక్కువ మొత్తంతో పెట్టుబడి ప్రారంభించడం. ఎక్కువ కాలం ఈ పెట్టుబడిని మీరు కొనసాగించినట్లయితే దీర్ఘకాలంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు.