ఏపీలో డీఎస్సీ రాసేవాళ్లకు అలర్ట్.. ఆ సిలబస్ లో మార్పు..?

ఏపీ విద్యాశాఖ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియ జరుగుతున్న సంగతి విదితమే. బదిలీల ప్రక్రియ ముగిసిన వెంటనే ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యాశాఖ మొదట లిమిటెడ్ డీఎస్సీ పేరుతో బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయనుంది. 403 బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం మొదట నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం. Also Read: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రెండు […]

Written By: Kusuma Aggunna, Updated On : December 26, 2020 2:36 pm
Follow us on


ఏపీ విద్యాశాఖ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియ జరుగుతున్న సంగతి విదితమే. బదిలీల ప్రక్రియ ముగిసిన వెంటనే ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యాశాఖ మొదట లిమిటెడ్ డీఎస్సీ పేరుతో బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయనుంది. 403 బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం మొదట నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం.

Also Read: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రెండు కీలక నిర్ణయాలు..?

విద్యాశాఖ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం రెగ్యులర్ డీఎస్సీకి 15,000కు పైగా పోస్టులు అందుబాటులో ఉన్నాయి. విద్యాశాఖ అధికారులు రెగ్యులర్ డీఎస్సీకి ముందు టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. బ్యాక్ ల్యాగ్ పోస్టుల భర్తీకి మార్చి నెలలోనే ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా కరోనా మాహమ్మారి, లాక్ డౌన్ వల్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటం గమనార్హం.

Also Read: దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ కోర్సులు నేర్చుకునే ఛాన్స్.?

403 బ్యాక్ ల్యాగ్ పోస్టుల భర్తీకి అర్హత ఉన్న కేటగిరీ అభ్యర్థులు లేకపోతే మిగిలిన ఉద్యోగాలను రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో టెట్ సిలబస్ లో మార్పులు చేస్తున్నారని సమాచారం. ఎస్సీఈఆర్టీ ఇప్పటికే టెట్ సిలబస్ లో మార్పులు చేసేందుకు కసరత్తును ప్రారంభించింది. విద్యాశాఖ అధికారులు 2018 సెప్షల్ డీఎస్సీలో మిగిలిపోయిన 78 పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

ఏపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లలో కూడా ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉండే విధంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టగా 15 వేలకు పైగా ఖాళీలు ఉండవచ్చని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జగన్ సర్కార్ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేయడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.