వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని తిరుమలలో ఉదయం నాలుగు గంటలకు దర్శనం ప్రారంభమవగా సాధారణ భక్తులతో పాటు వీఐపీ దర్శనాల కోసం క్యూ కట్టారు. శుక్రవారం కావడంతో అభిషేకం అనంతరం దర్శనాలు మొదలయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏకాదశి శోభ సంతరించుకుంది. రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలన్నీ గోవిందనామస్మరణతో మారుమోగుతున్నాయి. చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు ఉదయం 4 గంటల నుంచే క్యూలో ఉన్నారు. తెలంగాణలోని యాదాద్రి, భద్రాచలం ఆలయాల్లో వేకువ జామునే దర్శనాలు ప్రారంభమయ్యాయి.