https://oktelugu.com/

టెలిగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఆ ఫీచర్లకు డబ్బులు కట్టాల్సిందే..?

ప్రపంచ దేశాల్లో ఎంతోమంది టెలిగ్రామ్ యాప్ సేవలను వినియోగించుకుంటున్నారు. మన దేశంలో సైతం టెలిగ్రామ్ యూజర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ యాప్ యూజర్లు ఉచితంగానే ఈ యాప్ ను వినియోగించుకున్నారు. అయితే ఇకపై మాత్రం టెలిగ్రామ్ యాప్ లోని కొన్ని ఫీచర్లను వినియోగించుకోవాలంటే మాత్రం డబ్బులు కట్టాల్సిందే. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి కొన్ని ఫీచర్లకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 25, 2020 / 09:11 AM IST
    Follow us on


    ప్రపంచ దేశాల్లో ఎంతోమంది టెలిగ్రామ్ యాప్ సేవలను వినియోగించుకుంటున్నారు. మన దేశంలో సైతం టెలిగ్రామ్ యూజర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ యాప్ యూజర్లు ఉచితంగానే ఈ యాప్ ను వినియోగించుకున్నారు. అయితే ఇకపై మాత్రం టెలిగ్రామ్ యాప్ లోని కొన్ని ఫీచర్లను వినియోగించుకోవాలంటే మాత్రం డబ్బులు కట్టాల్సిందే. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి కొన్ని ఫీచర్లకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

    Also Read: కేంద్రం బంపర్ ఆఫర్.. ఆ స్కీమ్ లో చేరితే ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.5,000..!

    ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్ కు 500 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. సంవత్సరం సంవత్సరానికి టెలిగ్రామ్ యాప్ ను వినియోగించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కంపెనీకి డబ్బులు అవసరమని అందుకోసమే కొన్ని ఫీచర్లను వినియోగించుకోవడానికి ఛార్జీలు వసూలు చేస్తున్నామని పావెల్ తెలిపారు. 2013 సంవత్సరంలో పావెల్ అతని సోదరుడు టెలిగ్రామ్ యాప్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు.

    Also Read: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రెండు కీలక నిర్ణయాలు..?

    అయితే టెలిగ్రామ్ యాప్ లోని కొన్ని ఫీచర్లను వినియోగించుకోవడానికి ఎంత మొత్తం చెల్లించాలనే విషయం తెలియాల్సి ఉంది. కంపెనీని అమ్మే ఆలోచన లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని పావెల్ చెబుతున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఫీచర్లను ఉచితంగానే వినియోగించుకోవచ్చని భవిష్యత్తులో కొత్తగా అందుబాటులోకి వచ్చే ఫీచర్లకు మాత్రం టెలిగ్రామ్ యూజర్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    సమాచారం, వార్తలు పంపించుకోవడానికి, ప్రైవేట్ కమ్యూనికేషన్స్ కోసం టెలీగ్రామ్ యాప్ ఉపయోగపడుతుంది. ప్రీమియం యూజర్ల నుంచి టెలీగ్రాం యాప్ నగదును వసూలు చేయనుందని తెలుస్తోంది. మార్కెట్ లో ఇతర యాప్ ల నుంచి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో పావెల్ దురోవ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.