Karthika Masam: కార్తీక మాసం… తెలుగు వారింట దీనికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ మాసంలో తెలుగువారి లోగిళ్ళన్నీ.. పండగ శోభతో కళాకళాడతాయి. అయితే.., ఈ కార్తీక మాసంలో ఏమేమి చేస్తారు? ఎలాంటి పూజలు చేస్తారు? భగవంతున్ని ఎలా ఆరాధిస్తారు అన్నది మాత్రం అందరికీ తెలియదు. మరి, ఈ కార్తిక మాస పూజా ఫలాలు ఏవిధంగా పొందాలో చూద్దామా..
కార్తీక మాసంలో స్నానం, దానం, జపం, అభిషేకం, దీపారాధన చేయాలి. ముఖ్యంగా.. సూర్యోదయనికి ముందు చేసే స్నానాలకు, ఆ తర్వాత చేసే దానాలకు గొప్ప శక్తి ఉందని పురాణోక్తి. ఈ మాసంలో శివారాధన చేస్తే.. అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం. ఉపవాసాల వల్ల మంచి ఆరోగ్యం, దైవ చింతన మెండుగా కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైనది క్షీరాబ్ధి ద్వాదశి. హిందూ సనాతన ధర్మంలో పంచ భూతాలను దైవాలుగా కొలుస్తారు. ఇందులో భాగంగా.. దీపాన్ని వెలిగించడం అంటే.. అగ్నిని ప్రతిరోజూ ఆరాధించడమే. అయితే.. నిత్యం ఈ పని చేయలేని వారు.. కార్తీక శుక్ల ద్వాదశి రోజున దీపారాధన చేస్తే.. ఏడాది మొత్తం దీపారాధన చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందని కార్తీక పురాణం చెబుతోంది.
ఈ మాసంలో ప్రతీ సోమవారం అత్యంత పవిత్రమైన రోజుగా శివపురాణం చెబుతోంది. ఈ వారాల్లో పరమేశ్వరుడిని ఆరాధించి, పంచామృతాలతో అభిషేకించడం, ఉపవాసం, నదీ స్నానం చేసి, ఈశ్వరుడుని ఆరాధిస్తే.. హరి హరుల అనుగ్రహం లభిస్తుందని పురాణం చెబుతోంది. ఇక, అత్యంత కీలకమైన కార్తీక పౌర్ణమి రోజున శివుడిని ఆరాధించి, జ్వాలాతోరణాన్ని దర్శించుకోవాలి. తద్వారా.. ఆ మహా శివుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని శాస్త్రం.
Also Read: కార్తీక మాసమంతా దీపాలు ఎందుకు వెలిగిస్తారో తెలుసా?
ఇదిలా ఉంటే.. ఈ కార్తీక మాసంలో.. వనభోజనాల సందడి కూడా మొదలవుతుంది. ఈ వనభోజనాల ప్రస్తావన అనేక ధార్మిక గ్రంథాలతో పాటు ‘కార్తీక పురాణం’లో కూడా ఉంది. కార్తీక పౌర్ణమి రోజున నైమిశారణ్యంలో మునులు అందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు చేశారని పూర్వికులు చెబుతూ ఉంటారు. మునులు ఉసిరి చెట్టుకింద విష్ణువుని ప్రతిష్టించి.. గోవింద నామస్మరణతో పూజలు చేసి.. ఆ తరువాత వనభోజనాలు చేశారట. అలా మహర్షులు మొదలు పెట్టిన కార్తీకవనభోజనాల కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని చెబుతుంటారు. ఈ విధంగా.. కార్తీక మాసంలో అటు దైవ చింతన, ఇటు ఆట విడుపు రెండిటినీ అస్వాదించాలని శాస్త్రం.
Also Read: అప్పుల బాధలు తొలగిపోవాలంటే శుక్రవారం ఈ దీపం వెలిగించాలి!
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Do you know how to worship god in karthika masam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com