Kadapa: వివాహేతర సంబంధాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. కుటుంబాలను వీధిన పడేస్తున్నాయి. ఇంటి పెద్దను దూరం చేస్తున్నాయి. పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. సాటి మనిషిని మట్టు పెట్టేందుకు పురిగొల్పుతున్నాయి. అటువంటి ఘటనే కడప జిల్లాలో జరిగింది. మంచం కింద డిటోనేటర్లు పేల్చడంతో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వివాహేతర సంబంధం తోనే నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని పోలీస్ విచారణలో తేలడం విశేషం.ప్రస్తుతం నిందితుడు పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికంగా సంచలనం అయ్యింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. వేముల మండలం కొత్తపల్లికి చెందిన వీఆర్ఏ నరసింహ తన ఇంట్లో నిద్రిస్తున్నాడు. అయితే ఆయన మంచం కింద డిటోమీటర్లు పెట్టి పేల్చడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో వీఆర్ఏ నరసింహ భార్య సుబ్బలక్ష్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను వెంటనే వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
* దర్యాప్తు ప్రారంభం
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.వివాహేతర సంబంధం కారణంగా.. పాత కక్షలతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బాబు అనే వ్యక్తి ఈ పేలుడుకు కారణమని అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతుడికి ఒక కుమార్తె ఉంది.ఆమె వాంగ్మూలం బట్టి బాబు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అందుకే ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
* ఇల్లు ధ్వంసం
ఈ ఘటనలో మృతుడి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. నరసింహం మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాబు అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు మృతుడి కుమార్తె పుష్పవతి ఆరోపిస్తోంది. బాబుతో మృతుడి భార్య సన్నిహితంగా ఉండేదట.ఇటీవల దూరం పెట్టడంతో పగతో రగిలిపోయిన బాబు నరసింహను చంపినట్లు తెలుస్తోంది. గతంలోని వీరిద్దరి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ముందస్తు ప్లాన్ ప్రకారం కరెంటు ఆపి, డిటోనేటర్లు పెట్టి హత్య చేసినట్లు మృతుడి కుమార్తె ఆరోపిస్తోంది. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More