Viral Instagram Reel: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో కొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. ఇంకొన్ని అయితే వింతగానూ ఉంటుంది. ఈ వీడియో ఆసక్తికరంగా లేదు. ఆశ్చర్యకరంగా అంతకన్నా లేదు. దీనిని వింత అని కూడా చెప్పుకోవడానికి లేదు. ఈ వీడియో చూస్తుంటే మనిషి పుట్టుక మీద ఏవగింపు కలుగుతుంది.. అసలు ఇలా కూడా చేస్తారా అనే అభిప్రాయం కలుగుతోంది.
ఇంస్టాగ్రామ్ లో కనిపిస్తున్న వీడియోలో ఓ వ్యక్తి చనిపోయాడు. అతడి మృతదేహం పక్కన కుమార్తె కూర్చుని ఉంది.. తండ్రి చనిపోయిన బాధలో ఏడుస్తూ ఉంది.. వాస్తవానికి తండ్రి చనిపోతే ఏ కూతురు కైనా సరే ఇలానే బాధ ఉంటుంది.. కానీ ఈ కూతురు చాలా డిఫరెంట్. పైగా ఆమె తన బాధను వ్యక్తం చేయడంలో పూర్తి విభిన్న శైలిని ప్రదర్శిస్తోంది. తండ్రి చనిపోయిన బాధను వ్యక్తం చేస్తూనే.. డిఫరెంట్ గా ఏడుస్తోంది. చేపల కూర నుంచి మొదలుపెడితే.. చేసే ఉద్యోగం వరకు మొత్తం ఏకరువు పెట్టింది. తన తండ్రి మృతదేహం వద్ద సెల్ఫీ స్టిక్ ఆన్ చేసి తన ఏడుపును మొత్తం రికార్డు చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి ఒక తండ్రి చనిపోతే కుమార్తెకు విపరీతమైన బాధ ఉంటుంది. పైగా తండ్రికి, కూతురికి మధ్య ప్రేమ విపరీతంగా ఉంటుంది. కానీ ఆ ప్రేమను ప్రదర్శించే విధానం వేరే విధంగా ఉంటుంది.. కానీ ఈ మహిళ మాత్రం మరో విధంగా తన ప్రేమను వ్యక్తం చేయడం విశేషం.
తండ్రి చనిపోయినప్పుడు బాధ ఉండడం సహజం. అయితే ఈ మహిళ మాత్రం తన బాధను మరో విధంగా వ్యక్తం చేసింది. పైగా తన ఏడుపును మొత్తం రికార్డు చేసి సోషల్ మీడియాలోకి ఎక్కించింది.. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలంటే విభిన్నమైన పనులు చేయాలి.. అందువల్లే ఈ మహిళ అలాంటి పని చేసి ఉండవచ్చు. ఆమె చేసిన పనిని చాలామంది విమర్శిస్తున్నారు. తండ్రి చనిపోయినప్పుడు ఏడుస్తున్న తీరుని కూడా ఫోన్లో రికార్డ్ చేయాలా? దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలా? ఇదేం పద్ధతి.. ప్రేమను వ్యక్తం చేయడంలో అనేక పద్ధతులు ఉంటాయి.. కానీ ఇలా ఎవరు ప్రవర్తించి ఉండరని..నెటిజన్లు పేర్కొంటున్నారు.. ఏడ్చే విధానంలో ఈమె సరికొత్త ట్రెండ్ సృష్టించిందని వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram