క్రైమ్‌Pune Pregnant Job Offer: నన్ను తల్లిని చేస్తే ₹25 లక్షలు ఇస్తాను!

Pune Pregnant Job Offer: నన్ను తల్లిని చేస్తే ₹25 లక్షలు ఇస్తాను!

Pune Pregnant Job Offer: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత స్కామర్లు కొత్త కొత్త నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఏ స్థాయిలో అవగాహన కల్పించినప్పటికీ.. స్కామర్లు కొత్త కొత్త విధానాలలో ఆర్థిక నేరాలకు ఒడిగడుతున్నారు. గతంలో మీ పేరు మీద నిషేధిత వస్తువులు వచ్చాయని.. మీకు విదేశాల నుంచి బంగారం లేదా ఇతర పార్సిల్లు వచ్చాయని.. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని.. ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టేవారు. మొబైల్ నెంబర్ కు మెసేజ్ పంపించి ఫలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని.. చూస్తుండగానే ఖాతాను మొత్తం కొల్లగొట్టేవారు. ఈ తరహా మోసాలపై పోలీసులు అవగాహన కల్పించిన నేపథ్యంలో ప్రజలు కాస్త జాగ్రత్త పడ్డారు. అయితే ఇప్పుడు దోచుకోవడానికి స్కామర్లు కొత్త విధానాలకు రూపకల్పన చేశారు. అందులో ఈ తరహా మోసం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

“నాకు వివాహం జరిగింది. భర్త నపుంసకుడు. నాకు కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఉంది. నాకు ఐవీఎఫ్, ఫెర్టిలిటీ ద్వారా సంతానం పొందాలనే కోరిక లేదు. చివరికి సరోగసి కూడా అవసరం లేదు. నన్ను తల్లిని చెయ్యగలిగే పురుషుడు కావాలి. నన్ను తల్లిని చేస్తే 25 లక్షలు చెల్లిస్తాను” అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ సర్కులేట్ అవుతోంది.. అయితే ఈ వీడియో నిజమైన నమ్మిన ఓ వ్యక్తి నిండా మోసపోయాడు.

మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన 44 సంవత్సరాల కాంట్రాక్టర్ ఆ వీడియో లో మహిళ చెప్పిన మాటలు మొత్తం నిజమైన నమ్మాడు. ఆ వీడియో లో ఆ మహిళ పేర్కొన్న నంబర్ కు ఫోన్ చేశాడు. అతడితో వారంతా రిజిస్ట్రేషన్ ఫీజు, వెరిఫికేషన్ చార్జీలు, జీఎస్టీ, టీడీఎస్ పేరుతో భారీగా చెల్లింపులు చేయించుకున్నారు.. గడిచిన సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు 11 లక్షలు అతడి వద్ద వసూలు చేశారు. ఆ తరువాత ఎంత సేపటికీ ఫోన్ ఎత్తలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి.. పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. దీంతో వారు అతడు అందించిన వివరాల కేసు నమోదు చేశారు.

వాస్తవానికి ఈ తరహా మోసాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. అయితే చాలామంది వీటిని నిజం అనుకొని భావిస్తున్నారు. అంతే కాదు.. మోసగాళ్ళు చెప్పిన నంబర్లకు డబ్బు పంపిస్తూ నిండా మునుగుతున్నారు. ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Discover Pune’s JM Road : ఏం పోశారు రా రోడ్డు.. 40 ఏళ్లుగా ఒక్క గుంత లేదు.. ఎక్కడుందో తెలుసా?

Discover Pune's JM Road : మన భారతదేశంలో కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు గతుకుల రోడ్లు.. డ్యామేజ్ అయినా రహదారులు కనిపిస్తూ ఉంటాయి. అయితే కొత్తగా వేసిన రోడ్డు సైతం కొన్ని రోజుల...

Pune couple on bike : సిగ్గూ ఎగ్గూ లేదు.. నడిరోడ్డుపైనే ఆ పని.. వీడియో వైరల్

Pune couple on bike : ఒకప్పుడు శృంగారం అనేది నాలుగు గోడల మధ్య నడిచే యవ్వారం.. చాటు మాటు సరసాలు ఉండేవి. కానీ ఇప్పుడు అంతా ఓపెన్. విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ...

Most Popular

Nandyal Missing Girl: తుని చిన్నారి తరహాలోనే ఏపీలో మరో బాలిక మిస్సింగ్.. చివరికి ట్విస్ట్

Nandyal Missing Girl: కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీ ఇంతవరకు వీడలేదు. చిన్నారి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నంద్యాల జిల్లాలో జరిగిన ఓ...

Prashna Ravan Case: ప్రశ్న రావణ్ కేసు: గమన, ఇంద్రసేనా చౌదరికి.. ఆ స్థాయిలో డబ్బులు ఎక్కడివి..

Prashna Ravan Case: ప్రశ్న పేరుతో రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ఏర్పాటుచేసిన యూట్యూబ్ ఛానల్ వ్యవహారంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఛానల్ కు సీఈవోగా వ్యవహరించిన...

Sidiri Appalaraju: సిదిరి అప్పలరాజు తో అంట కాగిన ఫలితం.. కాశిబుగ్గ ఎస్సై కి జరిగింది ఘన సన్మానం..

Sidiri Appalaraju: స్నేహం మంచి వాళ్ళతో చేయాలి. ప్రేమ అనురాగం నిండిన వారితో సాగించాలి. బంధం గొప్పవాళ్ళతో పెన వేసుకోవాలి.. ఇలా కాకుండా స్థాయి.. అర్హత లేని వారితో స్నేహం.. ప్రేమ.. బంధాన్ని...

Raj Kumar Case: సై*కో రాజ్ కుమార్ నుంచి ఆ రెండు కుటుంబాల్లో తప్పించుకున్న ఒకే ఒక...

Raj Kumar Case: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో రాజ్ కుమార్ సృష్టించిన నరమేధం మామూలుది కాదు. ఏకంగా ఆరుగురుని అతడు పొట్టన పెట్టుకున్నాడు. అత్యంత కిరాతకంగా కత్తులతో...

Raj Kumar: కన్నవారు కాదన్నారు.. పోస్టుమార్టం వద్దన్నారు.. అనాథశవంలా రాజ్ కుమార్ అంత్యక్రియలు.. వీడియో

Raj Kumar: ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాడు. పదునైన కత్తులతో సై*కో మాదిరిగా వీరంగం చేశాడు. అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.. రాక్షసుడి మాదిరిగా వ్యవహరించాడు. నమ్మి వచ్చిన భార్యను.. కన్న కొడుకులను అత్యంత దారుణంగా...
Exit mobile version