Prashna Ravan Case: ప్రశ్న పేరుతో రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ఏర్పాటుచేసిన యూట్యూబ్ ఛానల్ వ్యవహారంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఛానల్ కు సీఈవోగా వ్యవహరించిన గమన.. ఆమె సహచరుడు ఇంద్రసేనా చౌదరిని పోలీసులు రెండో విడత కూడా విచారించారు.
విచారణలో భాగంగా వారి మధ్య జరిగిన ఆర్థిక.. వ్యక్తిగత వ్యవహారాలను బయటకు తీసుకొచ్చారు. పోలీసులు సంధించిన ప్రశ్నలకు వారు నేరుగా సమాధానం చెప్పకుండా.. పక్కదారి పట్టించే విధంగా మాట్లాడారు. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ కు సాగిన నిధుల ప్రవాహం గురించి పోలీసులు ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఛానల్ కు అంత మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చింది.. వీటికి ఆదాయ వనరులు ఎక్కడివి.. అనే కోణాలలో ఇంద్రసేన చౌదరిని.. గమనను పోలీసులు ప్రశ్నించారు.
నగదు బదిలీ విషయంలో వీరిద్దరూ అక్రమ మార్గాలను అనుసరించినట్టు తెలుస్తోంది. నగదు బదిలీ విషయంలో గమన.. ఇంద్రసేనా చౌదరి నోరు విపరీలు. చానల్లో కంటెంట్ సెలక్షన్.. స్క్రిప్ట్ మేకింగ్ ఇవన్నీ కూడా గమన చూసుకునే దని సమాచారం. ఇప్పటివరకు గమన ఆధ్వర్యంలో చాలావరకు వీడియోలను అప్లోడ్ చేశారు. అందులో మొత్తం విద్వేషపూరితమైనవై ఉన్నాయి. ఇంద్రసేనా చౌదరి సోదరుడు వైసిపి నాయకుడిగా ఉన్నారు. ఇంద్రసేనా చౌదరి కి గమనకు బెంగళూరులో పరిచయం అయింది. గమన ఒక బోటిక్ నిర్వహించేది. ఈమెకు రాము అనే భర్త ఉన్నాడు. ఇంద్రసేనా చౌదరితో పరిచయం గమనను తప్పుదారి పట్టించింది. రామును వదిలిపెట్టి గమన ఇంద్రసేనా చౌదరికి దగ్గర అయింది.
ఇంద్రసేనా చౌదరి, గమన కలిసి అనేక వ్యాపారాలు చేశారు. చివరికి రావణ్ ప్రశ్న ఛానల్ అప్పులలో ఉందని తెలుసుకుని టేక్ ఓవర్ చేశారు. ఆ తర్వాత ఛానల్ కు సీఈవోగా గమన వ్యవహరించారు. ఆ తర్వాత రావణ్ తో కలిసి గమన వీడియోలు రూపొందించారు. ఇటీవల వైసిపి అధినేత జగన్ ను గన్నవరం విమానాశ్రయంలో గమన కలిశారు. గమన.. ఇంద్రసేనా చౌదరి ఉపయోగించిన ఫోన్లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. డాటా తిరిగి సేకరించి ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారాలలో వీరిద్దరూ అక్రమ మార్గాలను అనుసరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ వీరిద్దరూ అక్రమ దారుల్లో నగదు ప్రవాహాన్ని కొనసాగిస్తే.. ఈ కేసు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.
