Gujarat: “అదృష్టం తలుపు తట్టేలాగా.. దురదృష్టం నీ వెంటే ఉంది.. అది నీ కర్మ.. ఇక ఎవడూ ఏం చేయలేడు” ఓ సినిమాలో డైలాగ్ ఇది. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఆ వ్యక్తి పరిస్థితి కూడా అటువంటిదే. చూస్తుండగానే 2.5 కోట్లు జేబులోకి వచ్చినట్టే వచ్చాయి. అదృష్టం గురించి తలచుకొని.. ఎగిరి గంతేస్తుండగా అసలు విషయం తెలియడంతో అతనికి బొమ్మ కనిపించింది. దీంతో అతడి పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుక మాదిరిగా అయిపోయింది.
అది గుజరాత్ రాష్ట్రం. ఆ రాష్ట్రంలో సావ్జీ పటేల్ అనే వ్యక్తి నివసించేవాడు. ఇతడికి గతంలోనే వివాహం జరిగింది. పిల్లలు కూడా పెద్దవాళ్ళయ్యారు. వాళ్లకు కూడా పిల్లలు పుట్టారు. పుట్టిన పిల్లలు పెళ్లీడుకు వచ్చారు.. పటేల్ గతంలో డయ్యు ప్రాంతంలో ఉండేవాడు. అక్కడ ఒక హోటల్లో పనిచేసేవాడు. దానికంటే ముందు అదే హోటల్ యజమానికి చెందిన ఒక భవనానికి పనిమనిషిగా ఉండేవాడు. పటేల్ తండ్రి ఒక రైతు. అందరికీ ఉనా ప్రాంతంలో ఒక ఇల్లు ఉంది. చాలా కాలం పాటు పని చేసిన పటేల్.. చివరి దశలో ఉనా ప్రాంతానికి వచ్చాడు. అక్కడే చనిపోయాడు. చనిపోవడానికి ముందే తన ఆస్తి మొత్తానికి వారసుడు తన మనవడని పేర్కొన్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో పటేల్ మనవడు ఉనా ప్రాంతానికి వెళ్ళాడు.
ఉనా ప్రాంతంలో తన తాత నివసించిన బంగ్లాను శుభ్రం చేయడం మొదలు పెట్టాడు. ఈ దశలో అందరికీ అక్కడి చెత్తబుట్టలో కోట్ల రూపాయల విలువ చేస్తే షేర్ మార్కెట్ కు సంబంధించిన పత్రాలు కనిపించాయి. దాదాపు వాటి విలువ 2.5 కోట్ల వరకు ఉంటుంది. దీంతో అతడు ఎగిరి గంతులు వేశాడు. తన దరిద్రం మొత్తం తీరిపోతుందని సంబరపడ్డాడు. ఆ ఆనందం అతడికి ఎంతోసేపు నిలవలేదు. ఆ షేర్లపై అతడితోపాటు తండ్రికి కూడా సమాన హక్కులు దక్కుతాయని పటేల్ ఆ పత్రాలలో రాశాడు. దీంతో అది కాస్త వివాదానికి దారి తీసింది. ఆ కుటుంబాల్లో ప్రస్తుతం ఆ 2.5 కోట్ల గురించి గొడవలు జరుగుతున్నాయి. అయితే ఆ షేర్లు మొత్తం తనకే దక్కుతాయని.. పటేల్ కుమారుడు చెబుతున్నాడు. మనవడు మాత్రం అలా కుదరదని స్పష్టం చేస్తున్నాడు. ఈ వివాదం కోర్టు దాకా వెళ్ళింది. గుజరాత్ హైకోర్టు నవంబర్ మూడున దీనిపై విచారణ నిర్వహించనుందని తెలుస్తోంది.