Walk-In Interview in Pune
Viral Video: ఎన్ని ఉద్యోగాలు భర్తీ అవుతున్నా కూడా చాలా మంది నిరుద్యోగుల గానే (Un employment) ఉండిపోతున్నారు. చదువులు చదివి ఏళ్ల తరబడి కొందరు ఖాళీగా ఉంటున్నారు. ఒక్క ఉద్యోగం కోసం ఎన్నో కలలు కంటారు. అవి నిజం కాకపోయే సరికి.. ఏదో ఒక ఉద్యోగం అంటూ సెటిల్ అవుతున్నారు. ఎక్కడైనా ఉద్యోగానికి ఖాళీలు ఉన్నాయంటే చాలు.. వెంటనే వేల మందికి ఆ కంపెనీ ముందు వాలిపోతుంటారు. నచ్చిన ఉద్యోగం చేయకపోయినా.. ఏదో ఒక ఉద్యోగం చేస్తే బెటర్ అని ఆలోచించి ఇష్టం లేకపోయినా కూడా జాయిన్ అవుతుంటారు. ఈ నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ (Programs) అన్ని కూడా ఉన్నా.. చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. రోజురోజుకీ ఉద్యోగాలకు డిమాండ్ (Demand) పెరిగిపోతుంది. అయితే తాజాగా పూణెలో (Pune) ఓ కంపెనీ ఉద్యోగాల కోసం వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించింది. 100 పోస్టులకు ఖాళీలు ఉండగా.. ఆ కంపెనీ బయట దాదాపుగా 3 వేల మంది లైన్లలో వెయిట్ చేశారు. దాదాపుగా కిలోమీటర్ పైగా పెద్ద క్యూలైన్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ నిరుద్యోగానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మగర్‌పట్టాలోని యూపీఎస్ సొల్యూషన్స్ అనే ఐటీ కంపెనీ 100కి పైగా ఉండే పోస్టులకు ఇంటర్వ్యూకి పిలిచింది. కేవలం100 పోస్టులకు ఇంత మంది రావడంతో సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. ఉద్యోగాలు లేక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇంత మంది ఉన్నారా అనిపిస్తుంది. అయితే ఇది కేవలం ఆ ఒక్క సిటీలో మాత్రమే. దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఎందరో ఉద్యోగాలు దొరక్క.. పొట్ట గూటి కోసం ఇష్టం లేని పనులు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇండియాలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు ఇలానే చాలా మంది ఉన్నారని, వీరి పరిస్థితి చూస్తే ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వీడియోనే సాక్ష్యం. ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా కూడా యువతకు భవిష్యత్తు లేదు. లక్షలు పెట్టి చదువు చదివినా కూడా మళ్లీ పది వేలకే ఉద్యోగాలు చేస్తున్నారు. చాలీ చాలని జీతం, తప్పని పరిస్థితుల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
ఈ రోజుల్లో ప్రతీ రంగంలో కూడా పోటీ పెరిగిపోయింది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఏదైనా కూడా ఒక పోస్టుకు వేల మంది పోటీ పడుతున్నారు. సాఫ్ట్‌వేర్, ప్రభుత్వ ఉద్యోగాలు రైల్వే, బ్యాంకు ఇలా ప్రతీ రంగంలో కూడా చాలా మంది ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. అయినా ఏదో కారణాల వల్ల జాబ్ రాని పరిస్థితి చోటుచేసుకుంటుంది.
Pune: Viral Video Shows Over 3,000 Engineers Queuing for Walk-In Interview, Highlighting Fierce IT Job Market Competition pic.twitter.com/9Tvng35aKO
— Pune Pulse (@pulse_pune) January 25, 2025