Discover Pune’s JM Road : మన భారతదేశంలో కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు గతుకుల రోడ్లు.. డ్యామేజ్ అయినా రహదారులు కనిపిస్తూ ఉంటాయి. అయితే కొత్తగా వేసిన రోడ్డు సైతం కొన్ని రోజుల తర్వాత వెంటనే గుంతలు పడడం లేదా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కానీ పూణేలోని ఓ రోడ్డు 48 సంవత్సరాల కిందట వేయగా.. ఇప్పటివరకు ఆ రోడ్డు చెక్కుచెదరకుండా ఉంది. అంతేకాకుండా 2.5 కిలోమీటర్ల వరకు ఒక్క గుంత కూడా కనిపించదు. అసలు విషయం ఏంటంటే ఈ రోడ్డు నిర్మించే ముందే కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి ఒక సవాలు విసిరారు. 10 సంవత్సరాల వరకు ఈ రోడ్డుపై ఒక్క గుంత ఉన్న కూడా తిరిగి రోడ్డు మొత్తం వేస్తామని అన్నారు.. కానీ 48 సంవత్సరాల వరకు ఆ రోడ్డు నాణ్యతతో ఉంది. ఇంతకీ ఆ రోడ్డు పూణేలో ఎక్కడ ఉంది? దీనిని నిర్మించింది ఎవరు? ఆ తర్వాత వీరికి జరిగిన నష్టం ఏంటి?
పూణే లోని జంగ్లీ మహారాజ్ రోడ్.. దీనినే ప్రస్తుతం JM రోడ్డు అని పిలుస్తున్నారు. శివాజీ నగర్ నుంచి దక్కన్ జింఖానా వరకు 2.5 కిలోమీటర్ల వరకు 6 రోడ్డు కనిపిస్తుంది. దీనిని 1976 జనవరిలో ప్రారంభించారు. 1972లో మహారాష్ట్రలో కరువు, మరదల కారణంగా పూణేలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఆ సమయంలో కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతూ ముంబైలోని రోడ్లు ఎన్నో వరదలు వచ్చినా కూడా తట్టుకొని ఎందుకు ఉంటున్నాయి? అన్న ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో ముంబైకి చెందిన Recondo అనే సంస్థ హార్ట్ మిక్స్ హాట్ mix అనే టెక్నాలజీతో రోడ్లను నిర్మిస్తుందని కొందరు చెప్పారు. ఈ రికoడో సంస్థను పార్శి సోదరులు నడిపేవారు. ఈ విషయం తెలుసుకున్న పూణేలోని కార్పొరేటర్ శ్రీకాంత్ శిలోరే పట్టుదలతో పార్శ బ్రదర్స్ కు శివాజీ నగర్ రోడ్డు కాంటాక్ట్ గా అప్పగించారు.
అయితే వారు కాంటాక్ట్ లో పేర్కొన్న ప్రకారం.. 10 సంవత్సరాల వరకు రోడ్డు నాణ్యత దెబ్బతింటే తిరిగి పూర్తిగా నిర్మిస్తామని సవాల్ విసిరారు. వీరు ఈ రోడ్డు నిర్మించే సమయంలో నాణ్యతను ఉపయోగించి హాట్ mix టెక్నాలజీని ఉపయోగించారు. భవిష్యత్తులో కేబుల్స్, తుఫాను వంటి నీటి కాలువల కోసం రోడ్డు అంచున ప్రత్యేకంగా డక్టులను ఏర్పాటు చేశారు.
ఈ విధంగా వారు వేసిన రోడ్డు 48 సంవత్సరాల వరకు నాణ్యతతో కూడుకొని ఉంది. ఇప్పటివరకు ఈ రోడ్డుపై ఎక్కడ గుంత ఏర్పడలేదు. 2010లో స్వల్ప మరమ్మతులు మినహా రోడ్డుకు నిర్వహణ ఖర్చులు ఎక్కడ అవసరం పడలేదు. అయితే దురదృష్టం ఏంటంటే ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత రికండో కంపెనీకి మళ్లీ కొత్త ప్రాజెక్టు రాలేదు. పార్శ బ్రదర్స్ వయసు ఎక్కువగా కారణంగా వారు మరో ప్రాజెక్టు చేపట్టలేదు అన్న ప్రచారం ఉంది. ఇటీవల వేసిన చాలా రోడ్లు, బ్రిడ్జిలు ఏడాది తిరగకముందే నాణ్యతను దెబ్బతింటున్నాయి. అలాంటి వారికి ఈ JM రోడ్డు స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు.