అసలు టీకా వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి?

ప్రపంచ దేశాల ప్రజలను కరోనా సెకండ్ వేవ్ భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు వైరస్ బారిన పడే అవకాశాలు తగ్గుతుండగా వ్యాక్సిన్ తీసుకోని వాళ్లకు మాత్రం కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. మరోవైపు మే నెల 1వ తేదీ నుంచి 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ విషయంలో కొంతమంది […]

Written By: Kusuma Aggunna, Updated On : May 4, 2021 9:42 am
Follow us on

ప్రపంచ దేశాల ప్రజలను కరోనా సెకండ్ వేవ్ భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు వైరస్ బారిన పడే అవకాశాలు తగ్గుతుండగా వ్యాక్సిన్ తీసుకోని వాళ్లకు మాత్రం కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. మరోవైపు మే నెల 1వ తేదీ నుంచి 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.

కరోనా వ్యాక్సిన్ విషయంలో కొంతమంది ప్రజల్లో అపోహలు నెలకొన్నాయని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతున్నారు. తప్పుడు ప్రచారాల వల్ల ప్రజలు భయాందోళనకు గురి కావద్దని శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు. శాస్త్రవేత్తలు, వైద్యులు కరోనా వ్యాక్సిన్ గురించి చెబుతూ కరోనా వ్యాక్సిన్ శరీరానికి హాని చేయకుండా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుందని చెబుతున్నారు. నెలసరి సమయంలో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు.

గర్భిణులు, పాలిచ్చే తల్లులు కరోనా వ్యాక్సిన్ తీసుకోవద్దని ప్రభుత్వం చెబుతోందని వ్యాక్సిన్ తీసుకున్నా భయందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. గర్భధారణకు ప్రయత్నించే యువతులు వ్యాక్సిన్ తీసుకోకపోతే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. రక్తహీనత సమస్యతో బాధ పడేవాళ్లు విధిగా టీకా తీసుకోవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

చర్మ సంబంధిత సమస్యలు, ఇతర వ్యాధులతో బాధ పడుతుంటే వైద్యుల సలహాలు, సూచనల ఆధారంగా కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.