https://oktelugu.com/

నెలకు రూ.3,600 చెల్లిస్తే కొత్తకారు మీ సొంతం.. ఎలా అంటే..?

ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటైన క్విడ్ కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు శుభవార్త చెప్పింది. రెనో కంపెనీకి చెందిన ఎంట్రీ లెవెల్ కారు క్విడ్‌పై ఈ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించడం ద్వారా ఈ కారును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. నెలకు రూ.3618 చెల్లించి ఈ కొత్త కారును కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం రెనో క్విడ్ కారు ధర రూ.3.18 లక్షలుగా ఉంది. కనీసం లక్ష రూపాయల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 4, 2021 / 09:53 AM IST
    Follow us on

    ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటైన క్విడ్ కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు శుభవార్త చెప్పింది. రెనో కంపెనీకి చెందిన ఎంట్రీ లెవెల్ కారు క్విడ్‌పై ఈ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించడం ద్వారా ఈ కారును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. నెలకు రూ.3618 చెల్లించి ఈ కొత్త కారును కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం రెనో క్విడ్ కారు ధర రూ.3.18 లక్షలుగా ఉంది.

    కనీసం లక్ష రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించిన వాళ్లు నెలకు రూ.3618 ఈఎంఐ చెల్లించడం ద్వారా ఈ కారుకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ కారు కొనుగోలు చేసిన వాళ్లకు ఈఎంఐ ప్రొటెక్షన్ ప్లాన్, జాబ్ లాస్ కవర్ వంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా అమలవుతూ ఉండటం గమనార్హం. రెనో క్విడ్ కారులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉండగా 0.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 1 లీటర్ ఇంజిన్ ను అమర్చింది.

    లీటర్ కు ఈ కారు 25 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుందని తెలుస్తోంది. సమీపంలోని షోరూంను సంప్రదించి ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. తక్కువ ధరకే మంచి కారు కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఈ కారు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    తక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించే అవకాశం ఉండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్లు సైతం ఈ కారును కొనుగోలు చేయవచ్చు. ప్రాంతాలను బట్టి ఈ కార్ల ధరలలో స్వల్పంగా మార్పులు ఉంటాయి.