
ప్రపంచ దేశాలు కరోనా వైరస్ విజృంభణ వల్ల పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. వెలుగులోకి వస్తున్న కరోనా వేరియంట్స్ ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంటే తాజాగా కరోనా హైబ్రిడ్ రకం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన రకాలతో పోలిస్తే కరోనా హైబ్రిడ్ మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా హైబ్రిడ్ మ్యూటెంట్ ను వియత్నాంలో కనుగొన్నారు.
ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వేరియంట్ లతో పోలిస్తే ఈ వేరియంట్ మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇండియాలో, బ్రిటన్‌లలో విపత్తును సృష్టించిన కరోనా మ్యూటెంట్ల లక్షణాలతో ఈ కొత్త మ్యూటెంట్ పుట్టుకొచ్చినట్టు తెలుస్తోంది. మన దేశంలాగే వియత్నాంలో కూడా కరోనా సెకండ్ వేవ్ కేసులు నమోదవుతున్నాయి. వియత్నాంలో ఉన్న 63 నగరాలలో 31 నగరాలలో కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్నాయి.
శాస్త్రవేత్తలు కరోనా బారిన పడ్డ రోగుల నుంచి తీసుకున్న శాంపిల్స్ పరిశీలించగా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వైరస్ పూర్వపు మ్యూటెంట్లను మించిన వేగంతో త్వరగా వ్యాపిస్తోందని, గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరి సోకే లక్షణం ఈ హైబ్రిడ్‌కు రకానికి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈ మ్యూటెంట్ గురించి తెలియజేస్తామని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కరోనా హైబ్రిడ్ వేరియంట్ వల్ల ప్రాణాలకు ముప్పు మరింత పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. హైబ్రిడ్ రకం మ్యూటెంట్‌కు అడ్డకట్ట వేయడం కష్టంగా మారిందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.