
ఆంధ్రప్రదేశ్ కు మరో లక్షా 80 వేల కోవిషీల్డ్ టీకాలు అందాలు ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడకు లక్ష డోసులు హైదరాబాద్ నుంచి మరో 80 వేల టీకా డోసులు చేరాయి. వీటిని గన్నవరంలోని రాష్ట్ర టీకాల నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పంపిణీ నిమిత్తం వీటిని జిల్లాలకు తరలించనున్నారు. ఈ లక్షా 80 వేల టీకా డోసులతో రాష్ట్రంలో టీకా పంపిణీ లో పురోగతి రానుంది.