గాలిని శుద్ధి చేసే పరికరాన్ని చూశారా ?

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా వైరస్ సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో రెండడుగుల భౌతిక దూరం పాటిస్తే చాలని చెప్పిన నిపుణులు వైరస్ గాలిలో ఆరడుగుల వరకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెబుతున్నారు. Also Read : ‘భారత్’లో డిసెంబర్ 3కు కరోనా వైరస్ […]

Written By: Navya, Updated On : August 22, 2020 11:28 am
Follow us on

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా వైరస్ సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో రెండడుగుల భౌతిక దూరం పాటిస్తే చాలని చెప్పిన నిపుణులు వైరస్ గాలిలో ఆరడుగుల వరకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read : ‘భారత్’లో డిసెంబర్ 3కు కరోనా వైరస్ మాయం..!

అయితే తాజాగా తెలంగాణకు చెందిన ఒక ప్రొఫెసర్ స్వచ్చమైన గాలిని పీల్చుకోవడానికి ఒక పరికరాన్ని రూపొందించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లోని బీవీఆర్ ఐటీ కాలేజ్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీనివాస్ గాలిలో వైరస్ ను నిర్మూలించే పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం వైరస్ నిర్మూలనతో పాటు దుమ్ము, ధూళి కణాలను శుద్ధి చేయడంలో సహాయపడుతుందని చెప్పారు.

గాలిని ఈ యంత్రం సహాయంతో నాలుగు దశల్లో శుద్ధి చేయవచ్చని ఆయన అన్నారు. తొలి దశలో యూవీ స్టెరిలైజేషన్ జరుగుతుందని, రెండో దశలో ఫ్లూడిజేషన్ జరుగుతుందని ఈ రెండు దశల ద్వారా గాలిలో వైరస్ నిర్మూలన సాధ్యమవుతుందని చెప్పారు. మూడు, నాలుగు దశలలో కార్బన్ డై యాక్సైడ్, గాలిలోని మలినాలను యంత్రం ద్వారా శుద్ధి చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ పరికరాన్ని ఎక్కడికైనా సులువుగా తీసుకొని వెళ్లవచ్చని… ఈ పరికరం ధర కేవలం పది వేల రూపాయలు అని చెప్పారు. ఈ పరికరం గాలిలో కరోనా ఉన్నా సోకకుండా సహాయపడుతుంది.

Also Read : బిగ్ స్కామ్: 18 నెలల్లో 8మందికి జన్మనిచ్చిన 65 ఏళ్ల మహిళ!