మాస్కు పెట్టుకోకుంటే కరోనా ఇలా సోకుతుంది!

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజులు గడుస్తున్నా పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రావడం లేదు. చాప కింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఏ విధంగా సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. తాజాగా ఈ వైరస్ మరో మూడు కొత్త మార్గాల్లో సోకుతోందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఈ వైరస్ మనకు తెలిసిన మార్గాల్లో కంటే తెలియని మార్గాల్లోనే వ్యాపిస్తుందని తెలుస్తోంది. Also Read : అదృష్టవంతులు.. రూ.1.8 కోట్ల విలువైన బంగారు ముద్దలు […]

Written By: Navya, Updated On : August 22, 2020 11:24 am
Follow us on

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజులు గడుస్తున్నా పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రావడం లేదు. చాప కింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఏ విధంగా సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. తాజాగా ఈ వైరస్ మరో మూడు కొత్త మార్గాల్లో సోకుతోందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఈ వైరస్ మనకు తెలిసిన మార్గాల్లో కంటే తెలియని మార్గాల్లోనే వ్యాపిస్తుందని తెలుస్తోంది.

Also Read : అదృష్టవంతులు.. రూ.1.8 కోట్ల విలువైన బంగారు ముద్దలు దొరికాయ్!

గాలిలో దుమ్ము, పబ్లిక్ రెస్ట్ రూంలు, తక్కువ తేమ ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని సమాచారం. తేమ ఎక్కువగా ఉన్న సమయంలో వైరస్ తక్కువగా వ్యాప్తి చెందుతుందని….. తేమ తక్కువగా ఉన్న సమయంలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలిలో సాపేక్ష ఆర్ధ్రత తగ్గే కొద్దీ వైరస్ సోకే రేటు పెరుగుతుందని చెప్పారు. తేమ తక్కువగా ఉంటే కరోనా సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వైరస్ వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

చైనా శాస్త్రవేత్తలు చేసిన మరో అధ్యయనంలో పబ్లిక్ టాయిలెట్స్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తేలింది. పబ్లిక్ టాయిలెట్స్ లో వైరస్ కణాలు వేగంగా చేరుకోగలవని అందువల్ల బహిరంగ టాయిలెట్స్ లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. మరో అధ్యయనం ప్రకారం గాలిలో దుమ్ము ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అయితే మాస్క్ లను ఉపయోగించడం ద్వారా వైరస్ బారిన పడే అవకాశాలు తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Also Read : ‘భారత్’లో డిసెంబర్ 3కు కరోనా వైరస్ మాయం..!