సాధారణంగా ఒక మహిళ 18 నెలల్లో ఎంత మంది పిల్లలకు జన్మనివ్వగలదు అనే ప్రశ్నకు ఇద్దరు లేదా ముగ్గురు అనే సమాధానం వినిపిస్తుంది. అయితే ఒక మహిళ మాత్రం 18 నెలల్లో ఏకంగా ఎనిమిది మందికి జన్మనిచ్చింది. ఈ ఘటన జాతీయ ఆరోగ్య మిషన్ లో జరుగుతున్న అక్రమాలకు నిలువెత్తు సాక్ష్యం. బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : గాలిని శుద్ధి చేసే పరికరాన్ని చూశారా ?
రాష్ట్రంలోని మజఫర్ పూర్ జిల్లా కోఠియా గ్రామంలో 65 సంవత్సరాల వృద్ధురాలు 18 నెలల్లో 8 మందికి జన్మనిచ్చినట్టు రికార్డుల్లో చూపించి జాతీయ ప్రసూతి ప్రయోజన పథకం కింద ఇచ్చే 2 వేల రూపాయలను ఎనిమిది సార్లు సొంతం చేసుకుంది. అధికారులు ఆధారాలతో సహా చూపించడంతో లీల, ఆమె భర్త షాక్ అయ్యారు. లీల తాను 18 నెలల్లో 8 మంది పిల్లలకు జన్మనిచ్చిన మాట వాస్తవం కాదని చెప్పారు.
తాను 21 సంవత్సరాల క్రితం ఒక మగబిడ్డకు మాత్రమే జన్మనిచ్చానని అన్నారు. లీల అధికారులతో తనపై కేసు నమోదు చేయవద్దని డబ్బులను తిరిగి చెల్లిస్తానని అన్నారు. లీలతో పాటు ఎంతోమంది కేంద్ర పథకం ద్వారా అక్రమంగా డబ్బు పొందుతున్నట్టు అధికారుల విచారణలో తేలింది. ఇలా అక్రమంగా డబ్బు పొందిన లబ్ధిదారులు దాదాపు 50 మంది ఉన్నారని సమాచారం. అధికారులు శాంతాదేవి అనే వృద్ధురాలు ఒకే రోజు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్టు, సబినా ఖాతూన్ అనే మరో వృద్ధురాలి పేరును కూడా జాబితాలో చేర్చినట్టు గుర్తించారు.
Also Read : అదృష్టవంతులు.. రూ.1.8 కోట్ల విలువైన బంగారు ముద్దలు దొరికాయ్!