https://oktelugu.com/

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారా.. తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వ్యాక్సిన్ ఇదే..?

దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి వల్ల ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటారో వాళ్లు మాత్రమే వైరస్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు వైరస్ నిర్ధారణ అయినా మరణం సంభవించే అవకాశాలు తక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతుంది. అయితే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 18, 2021 / 12:54 PM IST
    Follow us on

    దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి వల్ల ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటారో వాళ్లు మాత్రమే వైరస్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు వైరస్ నిర్ధారణ అయినా మరణం సంభవించే అవకాశాలు తక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతుంది. అయితే వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని వ్యాక్సిన్లు తీసుకుంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మరికొన్ని వ్యాక్సిన్లు తీసుకుంటే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను తీసుకుంటే తేలికపాటి జ్వరం, తలనొప్పి, అలసట, ఇంజెక్షన్ వేసిన చోట నొప్పి వస్తాయి.

    కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ను తీసుకోవడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం, అధిక చెమట, వికారం మరియు వాంతులు, ఇతర దుష్ప్రభావాలు కనిపిస్తాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టడం, ఇతర దుష్ప్రభావాలు కనిపించే అవకాశాలు ఉంటాయి.

    ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి. అయితే దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్ ను తీసుకుంటే మంచిది.