https://oktelugu.com/

హీరో రామ్ కుటుంబంలో తీవ్ర విషాదం

హీరో రామ్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన సొంత తాతయ్య అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని భావోద్వేగంతో తెలియజేస్తూ హీరో రామ్ ట్వీట్ చేశాడు. తన తాతయ్య గొప్పతనంపై హీరో రామ్ కన్నీళ్లు తెచ్చుకుంటూ ఎమోషనల్ అయ్యారు. హీరో రామ్ ట్వీట్ చేశారు. ‘కుటుంబం కోసం తన తాతయ్య ఎంతో శ్రమించారని ’ రామ్ తెలిపారు. విజయవాడలోని ఓ లారీ డ్రైవర్ గా ప్రారంభమై ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో […]

Written By:
  • NARESH
  • , Updated On : May 18, 2021 / 12:56 PM IST
    Follow us on

    హీరో రామ్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన సొంత తాతయ్య అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని భావోద్వేగంతో తెలియజేస్తూ హీరో రామ్ ట్వీట్ చేశాడు. తన తాతయ్య గొప్పతనంపై హీరో రామ్ కన్నీళ్లు తెచ్చుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

    హీరో రామ్ ట్వీట్ చేశారు. ‘కుటుంబం కోసం తన తాతయ్య ఎంతో శ్రమించారని ’ రామ్ తెలిపారు. విజయవాడలోని ఓ లారీ డ్రైవర్ గా ప్రారంభమై ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించిందని రామ్ భావోద్వేగానికి గురయ్యారు.

    కుటుంబసభ్యులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ఆరోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవాళ్లని హీరో రామ్ భావోద్వేగానికి గురయ్యారు. మీది రాజు లాంటి మనసు అని.. జేబులో ఉన్న డబ్బును బట్టి ఎవరూ ధనవంతులు కారని .. మంచి మనసు ఉన్న వాల్లే ప్రతి ఒక్కరూ ధనవంతులు అవుతారని మాకు నేర్పించారని హీరో రామ్ అన్నారు.

    మీ పిల్లలందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి మీరే కారణం అని హీరో రామ్ గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు మీ మరణవార్త నన్ను ఎంతో కలిసి వేసిందన్నారు. నా హృదయం ముక్కలైందని ఎమోషనల్ అయ్యారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నట్టు రామ్ తెలిపారు.