https://oktelugu.com/

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా.. ఇలా చేస్తే రూ.5 వేలు పొందే ఛాన్స్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ నెల 1వ తేదీ నుంచి 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వ్యాక్సిన్ ను వేసుకున్న వారికి కేంద్రం 5000 రూపాయలు ఇంటినుంచే గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా సినీ, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 21, 2021 / 09:26 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ నెల 1వ తేదీ నుంచి 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

    వ్యాక్సిన్ ను వేసుకున్న వారికి కేంద్రం 5000 రూపాయలు ఇంటినుంచే గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా సినీ, రాజకీయ ప్రముఖులు వ్యాక్సిన్ వేయించుకున్న సమయంలో తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలా మనం కూడా ప్రభుత్వం తెలిపిన వెబ్ సైట్ లో ఫోటోలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోతో పాటు ట్యాగ్ లైన్ ను కూడా పంపాల్సి ఉంటుంది.

    ప్రజలను ఇన్‌స్పైర్‌ చేసేలా ఈ విధంగా చేసిన వాళ్లలో ప్రతి నెలా 10 మందికి ఐదు వేల రూపాయలు క్యాష్ ప్రైజ్‌ అందనుంది. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు mygov.in వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని వివరాలను మొదట పొందుపరచాల్సి ఉంటుంది. ఆ తరువాత వ్యాక్సిన్ తీసుకున్న ఫోటోను జత చేసి టాగ్‌ లైన్‌ని జత చేసి పంపాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

    మరోవైపు జులై నెల చివరి వారం నాటికి కరోనా కేసులు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి కరోనా కేసులు నిజంగా తగ్గుతాయో లేదో తెలియాలంటే అప్పటివరకు ఆగాల్సిందే.