
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార.. ‘సిత’ పాప అని మహేష్ ముద్దుగా పిలుస్తాడు. పిల్లలతో మహేష్ బాబు ఆడుకుంటే ఆ టైం తెలియదు. అంతలా మహేష్ బాబు కుటుంబానికి టైం కేటాయిస్తాడు.
ఇక మహేష్ బాబు ఫ్యామిలీ సంగతులు అన్నీ కూడా ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ పంచుకుంటాడు. తన కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్ని సందర్భానుసారం గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తారు.
తాజాగా మహేష్ బాబు-నమ్రతల ముద్దుల కూతురు సితార చిన్నప్పటి ఫొటోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
ఈ సందర్భంగా చిన్నప్పటి సితార క్యూట్ ఫొటోను షేర్ చేసిన నమ్రత ‘ఈరోజు నన్ను నవ్వించిన చిత్రం’ అని రాసుకొచ్చారు. తన గారాల పట్టి బోసినవ్వులు చూసి తనకు హాయిగా ఉందని చెప్పుకొచ్చారు.