https://oktelugu.com/

పరిషత్ ఎన్నికల రద్దు..వదలిపెట్టని జగన్

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పు చెల్లదని అధికార పార్టీ వైసీపీ డివిజన్ బెంచ్ కు వెళ్లాలని నిర్ణయించుకుంది. హైకోర్టు తీర్పును టీడీపీ, సీపీఐ సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో పరిషత్ ఎన్నికలపై బంతి హైకోర్టుకు వెళ్లబోతోంది. దీంతో రాజకీయం రసకందాయంలో పడింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పారద్శకత లేదని వాటిని రద్దు చేయాలని పదేపదే చెబుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని […]

Written By:
  • NARESH
  • , Updated On : May 21, 2021 / 09:35 PM IST
    Follow us on

    ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పు చెల్లదని అధికార పార్టీ వైసీపీ డివిజన్ బెంచ్ కు వెళ్లాలని నిర్ణయించుకుంది. హైకోర్టు తీర్పును టీడీపీ, సీపీఐ సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో పరిషత్ ఎన్నికలపై బంతి హైకోర్టుకు వెళ్లబోతోంది. దీంతో రాజకీయం రసకందాయంలో పడింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పారద్శకత లేదని వాటిని రద్దు చేయాలని పదేపదే చెబుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ, సీపీఐ స్వాగతించారు.

    గత నెలలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పాటించలేదని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. దీంతో హైకోర్టు ఎన్నికల ప్రక్రియను రద్దు చేయడం సంచలనం కలిగించింది. హైకోర్టు తీర్పును టీడీపీ, సీపీఐ స్వాగతించగా అధికార వైసీపీ మాత్రం జీర్ణించుకోవడం లేదు. ప్రభుత్వం చట్టానికి సహకరించాలని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. హైకోర్టు తీర్పు రాష్ర్ట ప్రభుత్వ విధానాలు, అధికార దుర్వినియోగానికి చెంపపెట్టని సీపీఐ నేత రామకృష్ణ చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని సీపీఐ కోరినా ఎన్నికల కమిషన్ బేఖాతరు చేసిందన్నారు. కరోనా ఉధృతి తగ్గాక సజావుగా ఎన్నికలు నిర్వహించాలని రామకృష్ణ కోరారు.

    అధికార పార్టీ అసంతృప్తి
    ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మార్గదర్శకాలు పాటించలేదని, ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అధికార పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ బెంచ్ లో అప్పీలు చేయాలని నిర్ణయించింది. దీంతో పరిషత్ ఎన్నిక వ్యవహారం రసకందాయంలో పడినట్లు అయింది. ఇప్పటికే ఎన్నికలు పూర్తయి ఓట్ల లెక్కింపు జరగాల్సిన సమయంలో ఎన్నికలు రద్దు చేయడం సరికాదని సవాలు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తమకు నిరాశ కలిగించిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో మరోసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

    డివిజన్ బెంచ్ లో సవాలు
    హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాదని డివిజన్ బెంచ్ లో అప్పీలు చేస్తామని వైసీపీ నేతలు చెప్పారు. సింగిల్ బెంచ్ తీర్పుతో తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కరోనా సమయంలో మళ్లీ మళ్లీ ఎన్నికలు నిర్వహించడం వీలు కాదని పేర్కొంది. విలువైన ప్రజాధనం వృధా అవుతుందని నేతలు చెబుతున్నారు.