https://oktelugu.com/

కరోనా సోకిన వాళ్లకు మరో షాక్.. ఊపిరితిత్తుల్లో లోపాలట?

దేశంలో లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తో పోల్చి చూస్తే థర్డ్ వేవ్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా వైరస్ ప్రభావం మాత్రం శరీరంపై తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయం వెల్లడైంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ఊపిరితిత్తుల లోపాలను గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణ పరీక్షలు చేయడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యలను గుర్తించడం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 30, 2022 / 11:55 AM IST
    Follow us on

    దేశంలో లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తో పోల్చి చూస్తే థర్డ్ వేవ్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా వైరస్ ప్రభావం మాత్రం శరీరంపై తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయం వెల్లడైంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ఊపిరితిత్తుల లోపాలను గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    సాధారణ పరీక్షలు చేయడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యలను గుర్తించడం అసాధ్యమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు లాంగ్ కోవిడ్ తో బాధ పడుతున్న వాళ్లలో శ్వాస సంబంధిత సమస్యలను గుర్తిస్తున్నామని చెబుతున్నారు. అలసట వల్ల ఈ విధంగా జరుగుతోందా లేక శ్వాస పోకడలో వచ్చిన మార్పుల వల్ల ఈ విధంగా జరుగుతుందా? అనే విషయాలు శాస్త్రవేత్తల పరిశోధనల తర్వాత తేలే అవకాశం ఉంది.

    కరోనా నుంచి కోలుకున్న వాళ్లు సీటీ స్కాన్ చేయించుకున్న సమయంలో వీళ్లు ఆరోగ్యంగానే ఉన్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా బారిన పడిన వాళ్లలో చాలామందిలో కొంతమంది హోమ్ ఐసోలేషన్ లోనే కోలుకున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్న ఏడాది తర్వాత కూడా చాలామందిని అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తుండటం గమనార్హం. జెనాన్ గ్యాస్ స్కాన్ అనే విధానం ద్వారా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి కరోనా వల్ల ఊపిరితిత్తులకు నష్టం జరుగుతోందని గుర్తించారు.

    కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామందిలో శ్వాస మార్పిడి సాధారణంగా జరగడం లేదు. నిర్ధిష్ట కారణాలను గుర్తించడం ద్వారా సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం అయితే ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తుండటం గమనార్హం.