https://oktelugu.com/

Tollywood Upcoming Heroes: ఈ ఏడాది వెండి తెర‌కు ఎంట్రీ ఇస్తున్న సినీ వారసులు వీళ్లే..

Tollywood Upcoming Heroes: సినిమా పరిశ్రమలో వారసులు ఎంటర్ కావడం అనేదానిపైన చర్చ చాలా కాలం నుంచి నడుస్తున్నది. అయితే, వారసుల ఎంట్రీ ఇండస్ట్రీలోకి ఈజీ అవుతున్న మాట వాస్తవం. కానీ, ఆ తర్వాత నిలదొక్కుకోవాలంటే కష్టపడాల్సిందేనని సినీ పరిశీలకులు చెప్తుంటారు. అది నిజం కూడా. తొలి చిత్రానికి తమకున్న బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో మంచి లాంచింగ్ జరగొచ్చు. కానీ, తర్వాత సత్తా చాటాలంటే సరైన స్టోరి సెలక్షన్, యాక్టింగ్‌లో ప్రతిభ కనబర్చాల్సిందే. ఇకపోతే చిత్ర సీమకు […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 30, 2022 / 11:15 AM IST
    Follow us on

    Tollywood Upcoming Heroes: సినిమా పరిశ్రమలో వారసులు ఎంటర్ కావడం అనేదానిపైన చర్చ చాలా కాలం నుంచి నడుస్తున్నది. అయితే, వారసుల ఎంట్రీ ఇండస్ట్రీలోకి ఈజీ అవుతున్న మాట వాస్తవం. కానీ, ఆ తర్వాత నిలదొక్కుకోవాలంటే కష్టపడాల్సిందేనని సినీ పరిశీలకులు చెప్తుంటారు. అది నిజం కూడా. తొలి చిత్రానికి తమకున్న బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో మంచి లాంచింగ్ జరగొచ్చు. కానీ, తర్వాత సత్తా చాటాలంటే సరైన స్టోరి సెలక్షన్, యాక్టింగ్‌లో ప్రతిభ కనబర్చాల్సిందే. ఇకపోతే చిత్ర సీమకు నట వారసులు హీరోల తనయులు మాత్రమే కాకుండా.. ఇతరులు కూడా వస్తున్నారు. దర్శక, నిర్మాతల తనయులు కూడా సినీ పరిశ్రమకు వస్తున్నారు. ఈ ఏడాది తెలుగు చిత్ర సీమకు ఎంట్రీ ఇస్తున్న సినీ వారసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    Tollywood Upcoming Heroes

    కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాల విడుదల పోస్ట్ పోన్ అయిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే యంగ్ హీరోల చిత్రాలు విడుదలయ్యాయి. ‘హీరో, రౌడీ బాయ్స్’ చిత్రాల్లో నటించిన కథానాయకులు ఇద్దరూ నిర్మాతల తనయులే కావడం విశేషం. గల్లా పద్మావతి – గల్లా జయదేవ్‌ల తనయుడు అశోక్‌, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్‌ రెడ్డి. వీరిరువురి తొలి చిత్రాలు ఈ సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి.

    Ashish Reddy

    ఇకపోతే హీరోలుగా వీరిరువురి పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. వీరిద్దరూ కాకుండా మరో యంగ్ హీరో కూడా ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని తెలుస్తోంది. ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేశ్ రెండో కుమారుడు అభిరామ్.. కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తేజ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ ఫిల్మ్‌కు ‘అహింస’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలా ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు.

    Daggubati Abhiram

    Also Read: బన్నీని విస్మయానికి గురి చేసిన ‘ఏఏ’ ఫ్యామిలీ !

    బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన సంగతి తెలసిందే. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో పాటు ‘టైగర్ నాగేశ్వర్ రావు’ చిత్రాలు చేస్తున్నాడు. కాగా, బెల్లం కొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిచయం కాబోతున్నాడు. ‘స్వాతిముత్యం’ అనే పిక్చర్ తో హీరోగా బెల్లకొండ గణేశ్ పరిచయం కాబోతున్నాడు. ‘త్రీ రోజెస్, బేకర్ అండ్ బ్యూటీ, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి’ వంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ సంగీత్ శోభన్ తనయుడు సంతోశ్ శోభన్.. ఇప్పటికే హీరోగా రాణిస్తున్నాడు.

    Bellamkonda Ganesh

    Also Read: సినీ తారల నేటి ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు !

    Tags