తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధిత ఆర్టీసీ ఉద్యోగులకు అండగా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. కరోనా వైరస్ బారిన పడిన ఆర్టీసీ సిబ్బందికి కిట్లను అందజేయనున్నారు. ప్రభుత్వం అందజేసిన ఒక్కో కిట్ విలువ దాదాపు 1300 రూపాయలు అని సమాచారం. ఆర్టీసీ నుంచి ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది ఈ విధంగా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే 37 మంది ఆర్టీసీ ఉద్యోగులు వైరస్ సోకి మృతి చెందారని సమాచారం. తాజాగా 300 మంది ఉద్యోగులు వైరస్ బారిన పడగా కొందరు చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోగా… ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మిగిలిన వాళ్లు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
ప్రభుత్వం రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లకు వైరస్ బారిన పడిన ఉద్యోగులకు కిట్లను అందజేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం ఈ కిట్లలో మందులు, గ్లౌజులు, మాస్కులను ఉంచింది. రోగులలో ఆక్సిజన్ లెవెల్స్ ను గుర్తించే పల్స్ ఆక్సీమీటర్లను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.