https://oktelugu.com/

అధ్యక్షుడైనా బండి సంజయ్ సంతోషంగా లేడా?

తెలంగాణ బీజేపీ పగ్గాలు చేతికందినా బండి సంజయ్ సంతోషంగా లేడా? బీజేపీలో ఆయనది ఏం నడవడం లేదా? ఓ పక్క ఏపీ బీజేపీ అధ్యక్షుడైన సోము వీర్రాజు దూకుడుగా వెళుతుంటే బండి గోడకు కొట్టిన బంతిలా స్తబ్దుగా మారాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టి నెలరోజులు కూడా కాకముందే బీజేపీలో అసమ్మతులను ఏరివేస్తూ.. పార్టీ వ్యతిరేకుల మీద ఉక్కుపాదం మోపుతూ.. ప్రశ్నించిన మీడియాకు కౌంటర్ లేఖలు రాస్తూ.. అందరికీ సినిమా చూపించేస్తున్నారని టాక్ బీజేపీలో […]

Written By:
  • NARESH
  • , Updated On : August 26, 2020 2:23 pm
    Follow us on


    తెలంగాణ బీజేపీ పగ్గాలు చేతికందినా బండి సంజయ్ సంతోషంగా లేడా? బీజేపీలో ఆయనది ఏం నడవడం లేదా? ఓ పక్క ఏపీ బీజేపీ అధ్యక్షుడైన సోము వీర్రాజు దూకుడుగా వెళుతుంటే బండి గోడకు కొట్టిన బంతిలా స్తబ్దుగా మారాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టి నెలరోజులు కూడా కాకముందే బీజేపీలో అసమ్మతులను ఏరివేస్తూ.. పార్టీ వ్యతిరేకుల మీద ఉక్కుపాదం మోపుతూ.. ప్రశ్నించిన మీడియాకు కౌంటర్ లేఖలు రాస్తూ.. అందరికీ సినిమా చూపించేస్తున్నారని టాక్ బీజేపీలో ఉంది. కానీ తెలంగాణలో పరిస్థితి రివర్స్ లో ఉందని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    Also Read: టీ.కాంగ్రెస్ కు ఊపుతెచ్చే ప్లాన్ చేశారు?

    బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఇప్పుడు ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోలేకపోతున్నాడని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బండిని అడుగడుగునా పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మంత్రి శ్రీనివాసులు, గరికపాటి మోహన్ రావులు అడ్డుకుంటున్నారని టాక్ నడుస్తోంది. వాళ్లు చెప్పిందే బీజేపీలో నడుస్తోందని.. బండి కూడా ప్రతీ విషయంలోనూ వారినే సంప్రదించాల్సి వస్తోందన్న ప్రచారం సాగుతోంది

    తెలంగాణ బీజేపీలో ఇప్పుడు గరికపాటి, మంత్రి శ్రీనివాసులు ఇద్దరూ బలమైన కోటరీగా అవతరించారనే ప్రచారం ఆ పార్టీలో సాగుతోంది. వారు అడుగడుగునా బండి సంజయ్ పనిలో జోక్యం చేసుకుంటున్నారని చెబుతున్నారు. సంజయ్ తన దగ్గరి సహచరులకు దీనిపై గోడు వెల్లబోసుకున్నట్టు సమాచారం.

    పార్టీ విభాగాల కన్వీనర్ ల ఎంపికలో మంత్రి శ్రీనివాసులు చాలా మందిని నిర్ణయించారని.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి తన మనుషులను బీజేపీ శాఖల్లో పెట్టుకున్నాడని బండి సంజయ్ సన్నిహితుల వద్ద వాపోయినట్టు ప్రచారం సాగుతోంది.

    Also Read: వైఎస్ జగన్ పాలనలో ఆ పార్టీ నేతలకు చిప్పే గతా?

    ఇదే విషయమై రగిలిపోతున్న బండి సంజయ్ దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని కూడా ఓ దశలో అనుకున్నాడట..కానీ అధ్యక్షుడు అయ్యిండి కింది స్థాయి నేతల ఆధిపత్యానికి చెక్ పెట్టలేవా అన్న అపవాదు వస్తుందని.. చాలా తొందరగా చర్యలు తీసుకుంటే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళుతాయని వారిపై చర్యలకు దూరంగా ఉన్నాడట.. రాబోయే రోజుల్లో బీజేపీలో వారిద్దరి పెత్తనానికి బండి సంజయ్ చెక్ చెప్పబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.