రండి రండి.. నాకు కరోనా లేదు.. కూరగాయలు కొనండి!

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రజలు రోడ్లపైకి అడుగు పెడితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏ విధంగా వైరస్ సోకుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణాల యాజమాన్యాల నుంచి వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా గజగజా వణకాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజలు కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వెళ్లాలన్నా భయపడుతున్న నేపథ్యంలో అదిలాబాద్ […]

Written By: Kusuma Aggunna, Updated On : August 26, 2020 2:20 pm
Follow us on

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రజలు రోడ్లపైకి అడుగు పెడితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏ విధంగా వైరస్ సోకుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణాల యాజమాన్యాల నుంచి వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా గజగజా వణకాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రజలు కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వెళ్లాలన్నా భయపడుతున్న నేపథ్యంలో అదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన కూరగాయల వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. డోలి శంకర్ అనే కూరగాయల వ్యాపారి నిన్న స్థానికంగా ఉండే ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. ఆ పరీక్షల్లో తనకు నెగిటివ్ వచ్చింది. దీంతో నెగిటివ్ వచ్చిన సర్టిఫికెట్ ను ఫ్రేమ్ లా తయారు చేసి తనకు కరోనా సోకలేదని… తన దగ్గర ఎటువంటి భయం లేకుండా కూరగాయలు కొనుగోలు చేయవచ్చని చెప్పాడు.

అతని దగ్గర కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఉండటంతో ప్రజలు కూడా అతని దగ్గర కూరగాయలు కొనుగోలు చేయాడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా సర్టిఫికెట్ వల్ల కూరగాయలు కొనుగోలు చేసేవాళ్లలో కూడా భరోసా కల్పించిన వాడు అవుతున్నాడు. భవిష్యత్తులో ఇతర వ్యాపారులు సైతం డోలి శంకర్ తెచ్చుకున్న విధంగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నా ఆశ్చర్యం లేదు. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ వల్ల డోలీ శంకర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.