కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డ్ ఉన్నవారికి శుభవార్త..?

కరోనా వల్ల దేశంలోని ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతుండగా మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. అయితే కరోనా విజృంభిస్తున్న తరుణంలో రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల ప్రజలకు రేషన్ సరుకుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కరోనా విజృంభణ వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో […]

Written By: Kusuma Aggunna, Updated On : May 17, 2021 3:00 pm
Follow us on

కరోనా వల్ల దేశంలోని ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతుండగా మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. అయితే కరోనా విజృంభిస్తున్న తరుణంలో రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల ప్రజలకు రేషన్ సరుకుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

కరోనా విజృంభణ వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో రేషన్ పంపిణీ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదు. ఈ విషయం కేంద్రం దృష్టికి రావడంతో కేంద్రం వెంటనే స్పందించింది. రేషన్ పొందే వారికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని.. రాష్ట్రాలు రేషన్ సరుకుల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రేషన్ దుకాణాలను ఎక్కువ సమయం తెరిచి ఉంచాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

నెలలో అన్ని రోజులు రేషన్ షాపులు తెరిచే ఉంచాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో రేషన్ కార్డుదారులు నెలలో ఎప్పుడైనా సరుకులను పొందే అవకాశాలు ఉంటాయి. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల రేషన్ సరుకులు పొందేవాళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా కష్టకాలంలో పేదలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ ప్రకటన చేసింది.

మే, జూన్ నెలల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కోటా కాకుండా కేంద్ర ప్రభుత్వ కోటా కూడా ఉచితంగా లభిస్తుండగా రైతులకు ప్రయోజనం చేకూరనుంది.