https://oktelugu.com/

రెడ్ వైన్ తాగితే కరోనా సోకే ఛాన్స్ తక్కువ.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే?

ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ లో అంచనాలకు అందని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా సోకినా చాలామంది హోమ్ ఐసోలేషన్ లోనే కోలుకుంటూ ఉండటం గమనార్హం. అయితే శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో ఆసక్తికర విషయం వెల్లడైంది. రెడ్ వైన్ తాగితే కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారం రోజుల్లో 5 గ్లాసుల కంటే ఎక్కువ రెడ్ వైన్ తీసుకున్న వ్యక్తులు తక్కువగా కరోనా బారిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 29, 2022 / 04:40 PM IST
    Follow us on

    ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ లో అంచనాలకు అందని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా సోకినా చాలామంది హోమ్ ఐసోలేషన్ లోనే కోలుకుంటూ ఉండటం గమనార్హం. అయితే శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో ఆసక్తికర విషయం వెల్లడైంది. రెడ్ వైన్ తాగితే కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారం రోజుల్లో 5 గ్లాసుల కంటే ఎక్కువ రెడ్ వైన్ తీసుకున్న వ్యక్తులు తక్కువగా కరోనా బారిన పడ్డారని బోగట్టా.

    చైనాలోని షెంజన్ ఆస్పత్రిలో బ్రిటిష్ డేటా బేస్ ను శాస్త్రవేత్తలు విశ్లేషించి ఈ విషయాలను వెల్లడించారు. 4,73,957 మంది మద్యం తాగేవాళ్ల వివరాలను శాస్త్రవేత్తలు పరిశీలించగా వీళ్లలో 16,559 మంది కరోనా బారిన పడ్డారని సమాచారం. వీళ్లలో రెడ్ వైన్ తాగేవాళ్లు 17 శాతం తక్కువగా కరోనా బారిన పడినట్టు శాస్త్రవేత్తల ఫలితాల్లో వెల్లడైంది. మద్యంలో ఉండే పోలీఫెనాల్ వైరస్ బారిన పడకుండా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    షాంపేన్, వైట్ వైన్ తాగేవాళ్లు సైతం 8 శాతం తక్కువగా కరోనా బారిన పడ్డారని సమాచారం. అయితే మోతాదుకు మించకుండా తాగితే మాత్రమే ఈ ఫలితాలు ఉంటాయని మోతాదు మించితే మాత్రం ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడం మాత్రమే వైరస్ నుంచి బయటపడటానికి ఉత్తమమైన మార్గమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

    ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోని వాళ్లు వెంటనే వ్యాక్సిన్ ను వేయించుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువమంది వ్యాక్సిన్ వేయించుకోవడం వల్లే థర్డ్ వేవ్ లో కరోనా ప్రభావం ఎక్కువగా లేదని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం.