భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సూపర్‌వైజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ ఈ ఉద్యోగ ఖాళీల భర్తీని చేపట్టనుంది. మొత్తం 46 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనర్హం. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మహిళా సూపర్‌వైజర్ల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. పది అర్హతతో పది సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. న్యూట్రీషన్/సోషల్ వర్క్ లేదా సోషియాలజీ/చైల్డ్ డెవలప్‌మెంట్ లో గ్రాడ్యుయేషన్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 21,184 రూపాయలు వేతనంగా లభిస్తుంది. డాక్యుమెంట్ల వెరిఫికేషన్, షార్ట్ లిస్టింగ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న మహిళలు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 2 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
http://icsil.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మహిళలకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.