Omicron: దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. కరోనా సోకిన వాళ్లలో ఎక్కువమంది 3 నుంచి 4 రోజుల్లోనే కోలుకుంటున్నారు. అయితే ఒమిక్రాన్ సోకిన వాళ్లలో కొంతమందిలో కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించడం లేదు. నీరసం, ఒళ్లునొప్పులు, దగ్గు, తలనొప్పి లాంటి సమస్యలు ఒమిక్రాన్ సోకిన వాళ్లను ఎక్కువగా వేధిస్తున్నాయి. అయితే లక్షణాలు తక్కువగా ఉన్నా వైద్యుడిని సంప్రదించి మందులు వాడితే మంచిది.
ఎక్కువ రోజులు దగ్గు ఉంటే వైద్యుల సలహాలు, సూచనల మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. డెల్టా వేరియంట్ విజృంభించిన సమయంలో చాలామందిని శ్వాస సంబంధిత సమస్యలు వేధించాయి. కరోనా వల్ల ఆస్పత్రులలో చేరుతున్న వాళ్ల సంఖ్య తక్కువగానే ఉండటం గమనార్హం. ఒమిక్రాన్ సోకిన వాళ్లలో ఎక్కువమందిలో దురద, గొంతులో ఇబ్బందిలాంటి సమస్యలు వస్తున్నాయి.
Also Read: Omicron In India: ఒమిక్రాన్ తగ్గుతోంది కానీ వేధిస్తున్న ఆ సమస్యలు.. ఏంటంటే?
కొంతమందికి తలనొప్పి రెండు వైపులా కాకుండా ఒకవైపు వస్తుండటం గమనార్హం. కొంతమందిని ఒళ్లునొప్పులు వేధిస్తుంటే మరి కొందరిని చలిజ్వరం వేధిస్తుంది. కళ్లు ఎర్రబడటం, మూడు వారాలైనా దగ్గు తగ్గకపోవడంలాంటి సమస్యలు వేధిస్తున్నాయి. కొంతమందిని గొంతు ఇన్ఫెక్షన్లు, సైనస్ వేధిస్తున్నాయి. పారాసెటమాల్ వేసుకున్నా సమస్య తగ్గకపోతే ఇతర మందులను వాడాల్సి ఉంటుంది.
వైరస్ గొంతు వరకు పరిమితం కావడంతో ఊపిరితిత్తులపై ప్రభావం పడటం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు మాత్రం వైద్యుల సలహా ప్రకారం మందులను వాడాల్సి ఉంటుంది. ఎక్కువరోజులు దగ్గు ఉంటే దగ్గుమందు ద్రావాణాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఎక్కువ రోజులు గొంతునొప్పి ఉంటే అజిత్రోమైసిన్ లాంటి యాంటీ బయోటిక్స్ ను ఇస్తున్నామని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
Also Read: Kitchen Tips For Omicron: ఈ వంటింటి చిట్కాలతో ఒమిక్రాన్ నుంచి త్వరగా కోలుకుంటారు..