https://oktelugu.com/

Job Vacancies in Visakhapatnam: విశాఖలో 31 ఉద్యోగ ఖాళీలు.. రూ.90 వేలకు పైగా వేతనంతో?

Job Vacancies in Visakhapatnam: విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. 31 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప‌లు బ్యాక్‌లాగ్ టీచింగ్ పోస్టుల‌ను భర్తీ చేయనున్నారని సమాచారం. మొత్తం 31 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా ఉద్యోగ అనుభవం ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 27, 2022 / 10:38 AM IST
    Follow us on

    Job Vacancies in Visakhapatnam: విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. 31 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప‌లు బ్యాక్‌లాగ్ టీచింగ్ పోస్టుల‌ను భర్తీ చేయనున్నారని సమాచారం. మొత్తం 31 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా ఉద్యోగ అనుభవం ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

    Job Vacancies in Visakhapatnam

    మొత్తం 31 ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఉద్యోగ ఖాళీలు 29 ఉండగా హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్ల ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. న్యూరో సర్జరీ, న్యూరాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, ఎండోక్రైనాలజీ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎం/ డీఎన్‌) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    Also Read: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పదో తరగతి అర్హతతో?

    42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. ది డైరెక్ట‌ర్‌, విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌, విశాఖ‌ప‌ట్నం – 5300040, ఆంధ్ర‌ప్ర‌దేశ్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. మెరిట్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 92,000 రూపాయలకు పైగా వేతనం లభించనుంది. 2022 సంవత్సరం జనవరి 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://visakhapatnam.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

    Also Read: బీఈఎంఎల్‌లో 25 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.2,40,000 జీతంతో?