జ్వరం వస్తే కరోనా వైరస్ సోకినట్టేనా..?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో అంచనాలను మించి కరోనా కేసులు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసుల వల్ల ప్రజలు టెన్షన్ పడుతున్నారు. కరోనా వైరస్ ఏ రూపంలో సోకుతుందో ఎవరూ చెప్పలేరు. ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్ష చేయించుకొని పాజిటివ్ నిర్ధారణ అయితే చికిత్స చేయించుకుంటే మంచిది. కరోనా సోకిన చాలామందిలో జ్వరం ప్రధాన లక్షణంగా కనిపిస్తోంది. నాలుగైదు రోజుల పాటు జ్వరం ఉంటే కరోనా పరీక్ష చేయించుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. […]

Written By: Navya, Updated On : April 20, 2021 7:06 pm
Follow us on

దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో అంచనాలను మించి కరోనా కేసులు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసుల వల్ల ప్రజలు టెన్షన్ పడుతున్నారు. కరోనా వైరస్ ఏ రూపంలో సోకుతుందో ఎవరూ చెప్పలేరు. ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్ష చేయించుకొని పాజిటివ్ నిర్ధారణ అయితే చికిత్స చేయించుకుంటే మంచిది. కరోనా సోకిన చాలామందిలో జ్వరం ప్రధాన లక్షణంగా కనిపిస్తోంది.

నాలుగైదు రోజుల పాటు జ్వరం ఉంటే కరోనా పరీక్ష చేయించుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలతో బాధ పడేవాళ్లు మరింత జాగ్రత్తగా ఉంటే మంచిది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తినా వెంటనే కరోనా పరీక్ష చేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు.

వైరస్ శరీరంలో చేరిన తరువాత అశ్రద్ధ చేస్తే చికిత్స కోసం రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. శరీరంలో అసాధారణమైన మార్పులు వస్తే వెంటనే చికిత్స చేయించుకోవడం మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా వైరస్ శరీరంలోని ముఖ్య వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తుంది. జ్వరం వచ్చినా కరోనా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కొన్నిసార్లు లక్షలు ఖర్చు చేసినా కరోనా నుంచి కోలుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుంది.