నేటి నుంచి తెలంగాణలో థియేటర్లు బంద్

కరోనా కల్లోలం మరోసారి సినీ ఇండస్ట్రీని చావుదెబ్బ తీస్తోంది. ఇప్పటికే కరోనా-లాక్ డౌన్ తో ఏడాది పాటు మూతపడిన సినిమా ఇండస్ట్రీని తాజాగా సెకండ్ వేవ్ మరోసారి దెబ్బతీస్తోంది. తెలంగాణలో తాజాగా కరోనా విస్తృతి దృష్ట్యా రాత్రి కర్ఫ్యూను విధించారు. రాత్రి 8 గంటల తర్వాత అన్నీ మూసివేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బుధవారం నుంచి సినిమా థియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు. సినిమా థియేటర్ల నిర్వహణపై తాజాగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల […]

Written By: NARESH, Updated On : April 21, 2021 9:14 am
Follow us on

కరోనా కల్లోలం మరోసారి సినీ ఇండస్ట్రీని చావుదెబ్బ తీస్తోంది. ఇప్పటికే కరోనా-లాక్ డౌన్ తో ఏడాది పాటు మూతపడిన సినిమా ఇండస్ట్రీని తాజాగా సెకండ్ వేవ్ మరోసారి దెబ్బతీస్తోంది. తెలంగాణలో తాజాగా కరోనా విస్తృతి దృష్ట్యా రాత్రి కర్ఫ్యూను విధించారు. రాత్రి 8 గంటల తర్వాత అన్నీ మూసివేయాలని ఆదేశించారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బుధవారం నుంచి సినిమా థియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు. సినిమా థియేటర్ల నిర్వహణపై తాజాగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో ఈ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు.

ఏప్రిల్ 21 నుంచి 30వ తేదీ వరకు సినిమా థియేటర్స్ ను మూసివేస్తున్నట్లు తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. సినిమా థియేటర్ల నిర్వహణపై కార్యదర్శి విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు. ఈ మేరకు థియేటర్లు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

‘వకీల్ సాబ్’ ప్రదర్శిస్తున్న థియేటర్లు మినహా మిగతావి మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో ఇప్పటికే థియేటర్లపై ఆంక్షలు పెట్టారు. థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య ఒక సీటు వదిలేయాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు తెలంగాణలో పూర్తిగా థియేటర్లే మూసివేస్తున్న పరిస్థితి నెలకొంది.