ప్రజలకు షాకింగ్ న్యూస్.. మూడో దశలో చిన్నారులకు ముప్పు..?

దేశంలో కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో శరవేగంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఫస్ట్ వేవ్ లో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు కరోనాతో ఎక్కువగా బాధ పడ్డారు. సెకండ్ వేవ్ లో వృద్ధులతో పాటు యువత, మధ్య వయస్సు ఉన్నవారిపై కూడా కరోనా వైరస్ పంజా విసురుతోంది. అయితే కరోనా థర్డ్ వేవ్ లో మాత్రం పిల్లలు ఎక్కువగా కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ […]

Written By: Navya, Updated On : May 11, 2021 11:23 am
Follow us on

దేశంలో కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో శరవేగంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఫస్ట్ వేవ్ లో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు కరోనాతో ఎక్కువగా బాధ పడ్డారు. సెకండ్ వేవ్ లో వృద్ధులతో పాటు యువత, మధ్య వయస్సు ఉన్నవారిపై కూడా కరోనా వైరస్ పంజా విసురుతోంది. అయితే కరోనా థర్డ్ వేవ్ లో మాత్రం పిల్లలు ఎక్కువగా కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

కరోనా సెకండ్ వేవ్ లో 15 నుంచి 20 శాతం మంది పిల్లలు కరోనా బారిన పడుతుండగా మూడో దశలో 85 శాతం మంది కరోనా బారిన పడే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. ఈ నెలాఖరుకు వైరస్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వేగంగా జరిగితే కరోనా బారిన పడే అవకాశాలు అంత తగ్గుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడో దశ పొంచి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

థర్డ్ వేవ్ లో పిల్లలపై ఎక్కువ ప్రభావం పడుతుండటంతో దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం చేసిన పొరపాట్లే రెండో దశ ఉధృతికి కారణమని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. స్పైక్ ప్రోటీన్ లో వచ్చిన మార్పుల వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని సమాచారం. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.

ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్లు రెండో డోస్ ను ఆలస్యంగా తీసుకున్నా ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందరికీ వ్యాక్సిన్ పూర్తయ్యే వరకు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.