
హైదరాబాద్ నగరంలోని సీఎస్ఐఆర్- నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ) నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 54 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రాతపరీక్ష లేకుండా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది.
విద్యార్హత ఆధారంగా ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుంది. https://www.ngri.org.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 54 ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలు 42 ఉండగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలు 5, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 3, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 2, జేఆర్ఎఫ్ ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి.
బీకాం, బీఎస్సీ, బీఈ లేదా బీటెక్, పీజీ, ఎంటెక్, పీహెచ్‌డీ, నెట్ లేదా గేట్ అర్హత సాధించినవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం మే 10వ తేదీ దరఖాస్తులు ప్రారంభం కాగా 2021 సంవత్సరం మే 24 దరఖాస్తులకు చివరి తేదీగా ఉంది.
నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.