సాధారణంగా ఏదైనా వ్యాధి బారిన పడితే చికిత్స తీసుకున్న తరువాత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది. అయితే కరోనా విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. వైరస్ నుంచి కోలుకున్నా ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉండటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల ఆరోగ్య సమస్యలకు కారణమైన ఈ వైరస్ మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.
Also Read: కొత్తరకం కరోనా గురించి షాకింగ్ న్యూస్.. ఏ వ్యాక్సిన్ పని చేయదట..?
అమెరికా శాస్త్రవేత్తలు కరోనాపై పరిశోధనలు చేసి కరోనా మహమ్మారి మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని వెల్లడించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కరోనా సోకితే శ్వాస సంబంధిత సమస్యలు మాత్రమే తలెత్తుతాయని చాలామంది భావించారని అయితే కరోనా సోకిన వాళ్ల మెదడులో మైక్రోవాస్కుల్ అనే రక్త నాళాలు దెబ్బ తినే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read: ‘భారత్’లో విజృంభిస్తున్న మరో వ్యాధి.. 12వేల బాతులు మృతి..?
న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిస్ లో ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. మెదడుపై కరోనా ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోందని అయితే వైరస్ ఆనవాళ్లు మాత్రం మెదడులో కనిపించలేదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. పరిశోధనలు చేసే కొద్దీ వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజలను మరింత టెన్షన్ పెట్టేలా ఉండటం గమనార్హం.
మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్
మరోవైపు దేశంలో కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16,504 కొత్త కేసులు నమోదు కాగా 214 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 2,43,953 యాక్టివ్ కేసులు ఉన్నాయి.దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,49,649గా ఉంది. గడిచిన 24 గంటల్లో 214 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు.