https://oktelugu.com/

చెన్నకేశవ స్వామి ఆలయంలో బాలయ్య ఫైట్ సీక్వెన్స్ !

నట సింహం బాలయ్య బాబు హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా వచ్చే వారం నుండి ఓ ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు. ఈ సీక్వెన్స్ ను మొదట వారణాసిలో విస్తృతంగా షూట్ చేద్దామనుకున్నా కుదరలేదు. ఇప్పుడు ఈ సీక్వెన్స్ ను పలనాడు ప్రాంతంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో షూట్ ను ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాలో ఓ విలన్ రోల్ ఉంది. ఆ రోల్ లో మొదట […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 4, 2021 / 05:11 PM IST
    Follow us on


    నట సింహం బాలయ్య బాబు హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా వచ్చే వారం నుండి ఓ ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు. ఈ సీక్వెన్స్ ను మొదట వారణాసిలో విస్తృతంగా షూట్ చేద్దామనుకున్నా కుదరలేదు. ఇప్పుడు ఈ సీక్వెన్స్ ను పలనాడు ప్రాంతంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో షూట్ ను ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాలో ఓ విలన్ రోల్ ఉంది. ఆ రోల్ లో మొదట సంజయ్ దత్ అయితే బాగుంటుందనుకున్నా బడ్జెట్ సమస్య.. దాంతో శ్రీకాంత్ ను తీసుకున్నారు.

    Also Read: జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న మెగా హీరో !

    అన్నట్టు చెన్నకేశవ స్వామి ఆలయంలో బాలయ్య సీనియర్ పాత్ర హోమం చేస్తూ ఉండగా.. విలన్స్ అటాక్ చేస్తారని.. వారిని చంపే ప్రయత్నంలో సీనియర్ బాలయ్య పాత్ర కూడా ఈ ఆలయంలోనే చనిపోతుందని, అప్పటినుండి ఆ పాత్ర ఆత్మ ఈ ఆలయంలోనే ఉందని నమ్మే ఆ ఊరు జనం.. ఆయనకు గుడి కూడా కడతారని.. మొత్తానికి ఈ సీక్వెన్స్ వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. పర్సనల్ గా బాలయ్యకి ఈ సీక్వెన్స్ బాగా నచ్చిందట. అందుకే ఆయన ముందుగా ఈ సీక్వెన్స్ చేద్దామని వచ్చే వారం నుండి షూటింగ్ పెట్టిస్తున్నారు.

    Also Read: విభిన్న తరహా కథతో సత్యదేవ్ ‘గాడ్సే’

    ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేద్దామనుకున్న బోయపాటి ప్రపోజల్ ను బాలయ్య రిజెక్ట్ చేయడంతో.. ఫైనల్ గా ప్రగ్యా జైస్వాల్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. కాగా యంగ్ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఎక్కడా వెనుక అడుగు వేయకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించి, బాలయ్య ఫ్యాన్స్ కు ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయాడు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్