మన దేశంలో వంటనూనె ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ 132 రూపాయలు, గ్రౌండ్ నట్ ఆయిల్ 150 రూపాయలుగా ఉంది. ఈ రెండు నూనెలతో పోల్చి చూస్తే పామాయిల్ ధర తక్కువగా కేవలం 107 రూపాయలుగా ఉంది. రోజురోజుకు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు కొత్తరకం మోసానికి తెర లేపారు. సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ప్యాకెట్లలో పామాయిల్ ను నింపి ఆ ఆయిల్ నే విక్రయిస్తున్నారు.
Also Read: దంతాలు పుచ్చిపోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?
పామాయిల్ ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఎటువంటి నష్టం లేకపోయినా వినియోగదారులు డబ్బు రూపంలో నష్టపోవాల్సి వస్తోంది. తక్కువ ధర పలికే ఆయిల్ ను కస్టమర్లు ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని సమాచారం. ఏపీలోని చిలకలూరి పేట, నరసరావుపేట ప్రాంతాల్లో సైతం ఈ తరహా మోసాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.
Also Read: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..?
అందువల్ల వినియోగదారులు వీలైనంత వరకు బ్రాండెడ్ కంపెనీల వంటనూనెలను కొంటే మోసపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పేరు తెలియని కంపెనీల నుంచి కొనుగోలు చేయకపోవడమే మంచిది. ప్యాకెట్ల మాయాజాలం వల్ల హోల్ సేల్, చిల్లర వ్యాపారులు భారీగా లాభపడుతుండగా వినియోగదారులు మాత్రం నష్టపోతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తే మాత్రమే ఈ మోసాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ధరలు ప్రజలు వంటనూనె కొనుగోలు చేయాలంటే భయపడే స్థితికి తెస్తున్నాయి. లాక్ డౌన్ నిబంధనల వల్ల ఇతర దేశాల నుంచి వంట నూనే దిగుమతి ఆగిపోవడం వల్ల రేట్లు విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ తరువాత వంట నూనె ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని సమాచారం.