Corona: కరోనా కాటు.. మళ్లీ స్కూళ్లు బందేనా?

Corona: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం విస్తరిస్తోంది. దీంతో విద్యాలయాలు బంద్ చేయాలా? కొనసాగించాలా? అనే దానిపై సందిగ్దం నెలకొంది. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య రోజురోజుకు రెట్టింపవుతుండటంతో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అనే దానిపైనే ఆధారపడి ఉంది. దీంతో కరోనా కేసులు పెరగడంతో విద్యాసంస్థల మనుగడపై అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే పలు స్టేట్లు ఆంక్షలు కఠినతరం చేశాయి. ఈ క్రమంలో రాష్ర్టంలో కూడా నిబంధనలు అమలు చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈనెల 8 నుంచి […]

Written By: Srinivas, Updated On : January 15, 2022 2:47 pm
Follow us on

Corona: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం విస్తరిస్తోంది. దీంతో విద్యాలయాలు బంద్ చేయాలా? కొనసాగించాలా? అనే దానిపై సందిగ్దం నెలకొంది. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య రోజురోజుకు రెట్టింపవుతుండటంతో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అనే దానిపైనే ఆధారపడి ఉంది. దీంతో కరోనా కేసులు పెరగడంతో విద్యాసంస్థల మనుగడపై అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే పలు స్టేట్లు ఆంక్షలు కఠినతరం చేశాయి. ఈ క్రమంలో రాష్ర్టంలో కూడా నిబంధనలు అమలు చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Corona

ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇచ్చినా కరోనా విజృంభణతో సెలవుల విషయంలో అనుమానాలు వస్తున్నాయి. అయితే వైద్య ఆరోగ్య శాఖ సెలవులు పొడిగించాలని సూచించడంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఈ నేపథ్యంలో 20 వరకు సెలవులు పొడిగించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కువ రోజులు పొడిగిస్తే చదువులు దెబ్బతినే అవకాశం ఉండటంతో సెలవుల పొడిగింపుపై సర్కారు నిర్ణయం ఎలా ఉంటుందో అనే సంశయాలు వస్తున్నాయి.

Also Read:  లింగవివక్షపై మైక్రోసాఫ్ట్ సంస్థ కీలక నిర్ణయం.. థర్డ్ పార్టీతో నివేదిక..

ఇన్నాళ్లు కరోనా మొదటి, రెండో దశల్లో కూడా ప్రత్యక్ష తరగతులకు అవకాశం లేకపోవడంతో ఆన్ లైన్ తరగతులతోనే నెట్టుకొచ్చారు. దీంతో ప్రస్తుతం కూడా అదే బాటలో నడిస్తే చదువులు ముందుకు సాగే సూచనలు కనిపించడం లేదు. అందుకే ప్రత్యక్ష తరగతులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాఠశాలల కొనసాగింపు ఉంటుందా? లేదా? అనే ధోరణిలో పాఠశాలల యాజమాన్యాలు ఉన్నాయి.

ప్రస్తుతం సొంతూళ్లకు వెళ్లిన విద్యార్థులకు కరోనా భయం పట్టుకుంది. ఒకవేళ మళ్లీ పాఠశాలకు వెళ్లాక సెలవులు అంటే తిరిగి రావడానికి ఇబ్బందే. దీంతో సెలవుల విషయంలో ఏదో ఒకటి తేల్చితేనే బాగుంటుందనే అభిప్రాయం వస్తోంది. దీంతో సెలవులు పొడిగిస్తారా? లేక పాఠశాలలు ప్రారంభిస్తారా? అనే వాదనలు వస్తున్నాయి. కొందరైతే సెలవులు ఇస్తేనే సురక్షితమని తల్లిదండ్రుల నుంచి ఓ అభిప్రాయం వస్తోంది కానీ దీనిపై ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Also Read: లింగవివక్షపై మైక్రోసాఫ్ట్ సంస్థ కీలక నిర్ణయం.. థర్డ్ పార్టీతో నివేదిక..

Tags