Sukumar: బాలీవుడ్‌లో జెండా పాతనున్న సుకుమార్.. అక్షయ్ కుమార్‌తో మూవీ..

Sukumar: ప్రస్తుతం భారతదేశమే కాదు.. ప్రపంచం కూడా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నదని చెప్పొచ్చు. తెలుగు చిత్ర సీమ దర్శకులు, హీరోలకు దేశవ్యాప్త మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం తెలుగు సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాగా, చిత్రం చూసి నార్త్ ఇండియా ఫిదా అయిపోతున్నది. బాలీవుడ్ సినీ ప్రముఖులు డైరెక్టర్‌ను, మూవీ యూనిట్ సభ్యులను, హీరో హీరోయిన్స్ ను […]

Written By: Mallesh, Updated On : January 15, 2022 2:42 pm
Follow us on

Sukumar: ప్రస్తుతం భారతదేశమే కాదు.. ప్రపంచం కూడా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నదని చెప్పొచ్చు. తెలుగు చిత్ర సీమ దర్శకులు, హీరోలకు దేశవ్యాప్త మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం తెలుగు సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాగా, చిత్రం చూసి నార్త్ ఇండియా ఫిదా అయిపోతున్నది. బాలీవుడ్ సినీ ప్రముఖులు డైరెక్టర్‌ను, మూవీ యూనిట్ సభ్యులను, హీరో హీరోయిన్స్ ను అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సుకుమార్‌కు బాలీవుడ్ స్టార్ హీరో నుంచి తనతో సినిమా చేయాలని రిక్వెస్ట్ వచ్చింది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..

‘పుష్ప’ చిత్రాన్ని ఇటీవల చూసిన.. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్.. చిత్రం తనకు బాగా నచ్చిందని, మూవీ యూనిట్ ను ప్రశంసించాడు. ఈ క్రమంలోనే మూవీ డైరెక్టర్ సుకుమార్ కు అక్షయ్ ఫోన్ చేశారు. తనతో ఒక సినిమా చేయాలని సుకుమార్ ను కోరారు అక్షయ్ కుమార్. ఈ విషయం సుకుమార్ స్వయంగా తెలిపారు. అలా ఓ టాలీవుడ్ డైరెక్టర్‌కు బాలీవుడ్ స్టార్ హీరో నుంచి సినిమా చేయాలని ఆహ్వానం అందింది.

Also Read: సంక్రాంతి పందేలు.. ఈసారి రూ.2 వేల కోట్ల పైమాటే?.

అయితే, సుకుమార్ నెక్స్ట్ మూవీస్ లైనప్ అయితే చాలానే ఉన్నాయి. అవి పూర్తి అయిన తర్వాత సుకుమార్… అక్షయ్ కుమార్ తో మూవీ చేసే చాన్సెస్ ఉన్నాయి. ‘పుష్ప2’ చిత్రం విడుదల తర్వాత సుకుమార్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయాల్సి ఉంది. దాని తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’ను మించిన సినిమా చేయాల్సి ఉంది. ఈ చిత్రాలన్నీ పూర్తి అయిన తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బాలీవుడ్ హీరో అక్షయ్ తో సినిమా చేయొచ్చు. అయితే, టాలీవుడ్ డైరెక్టర్స్ పలువురు ఇప్పటికే బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ‘కబీర్ ఖాన్’ పిక్చర్ తీసి సక్సెస్ అయ్యాడు. ప్రజెంట్ రణ్ బీర్ కపూర్‌తో ‘యానమల్’ మూవీ చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ మూవీ చేశాడు.

Also Read:  యూపీలో బీజేపీకి వరుస షాక్‌లు.. ఈసారి గెలుపు కష్టమేనా?

Tags