KTR: భారత్ లో వ్యాపారం చేసేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే టెస్లా కార్ల ఉత్పత్తి చేసేందుకు సంకల్పించింది. కానీ కార్ల పరిశ్రమ దేశంలో స్థిరపడాలంటే కొన్ని షరతులు విధించింది. దీంతో దేశంలో మరో సంస్థ రావడానికి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మస్క్ ట్విటర్ లో చేసిన వ్యాఖ్యలతో చాలా మందిలో అనుమానాలు నెలకొన్నాయి. భారత ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలతో అందరిలో ఆగ్రహం పెరుగుతోంది. దీనిపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. దేశంలో, రాష్ర్టంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు దారులు తెరిచామని చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వస్తుంటే ఈయన మాత్రం రాకుండానే విమర్శలు చేయడంపై మండిపడ్డారు. తెలంగాణ పరిశ్రమల ఏర్పాటులో చాంపియన్ గా నిలిచిందని గుర్తు చేశారు.
Also Read: బాలీవుడ్‌లో జెండా పాతనున్న సుకుమార్.. అక్షయ్ కుమార్‌తో మూవీ..
తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో మంది ముందుకు వస్తుంటే మస్క్ కు మాత్రం ఇవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయంలో తెలంగాణ ముందంజలో ఉన్నట్లు గుర్తించడం లేదా అని అడిగారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్కెట్ పరంగా రెండో అతిపెద్ద విపణిగా భారత్ లో కార్లను ప్రవేశపెట్టేందుకు టెస్లా భావించినా లేనిపోని అభాండాలు వేయడంపై సహజంగా విమర్శలు పెరుగుతున్నాయి.
మస్క్ ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల్లో మస్క్ కొన్ని షరతులు విధించడమే దీనికి కారణంగా చెబుతున్నారు. సంస్థను దేశంలో నెలకొల్పకముందే విదేశాల్లో తయారు చేసిన కార్లను ఇక్కడ మార్కెటింగ్ చేస్తానని షరతు పెట్టారు. తరువాత కార్ల తయారీ సంస్థను నెలకొల్పుతానని చెప్పడం తెలిసిందే. దీనికి ప్రభుత్వం నో చెప్పింది. దీంతో కార్ల కంపెనీ అధినేత మస్క్ కు ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానమే ఇప్పుడు దుమారం రేపుతోంది.
భారత ప్రభుత్వ నిర్వాకంతోనే కార్ల ఉత్పత్తి ఆలస్యమవుతుందని మస్క్ చెప్పడంతో ఆయన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై మస్క్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని చెబుతోంది. దీనిపై జాతీయ, రాష్ర్ట మీడియాల్లో వస్తున్న వార్తలపై స్పందించింది. మస్క్ తీరు సరిగా లేదని దుయ్యబట్టింది. కావాలనే ఆలస్యం చేస్తూ భారత్ పై నిందలు మోపడం సరైంది కాదని పేర్కొంది.