కరోనా వైరస్ ను జయించడానికి పాటించిన సూత్రాలివే..?

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలన్నా ఒకవేళ కరోనా నిర్ధారణ అయినా త్వరగా కోలుకోవాలన్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సూత్రాలను పాటించడం ద్వారా కరోనా వైరస్ ను త్వరగా జయించడం సాధ్యమవుతుంది. కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించుకుని హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి. ఆన్ లైన్ లేదా […]

Written By: Navya, Updated On : May 6, 2021 8:10 am
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలన్నా ఒకవేళ కరోనా నిర్ధారణ అయినా త్వరగా కోలుకోవాలన్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సూత్రాలను పాటించడం ద్వారా కరోనా వైరస్ ను త్వరగా జయించడం సాధ్యమవుతుంది. కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించుకుని హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి.

ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో డాక్టర్ సలహాలను, సూచనలను పాటిస్తూ మందులు వాడాలి. కరోనా లక్షణాలు కనిపించిన వాళ్లు యాంటీజెన్ పరీక్షతో పోలిస్తే ఆర్టీ పీసీఆర్ పరీక్షను చేయించుకుంటే మరీ మంచిది. పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయితే ఏ మాత్రం కంగారు పడకూడదు. లక్షణాలు కనిపించిన ఐదు రోజుల వరకు ఎక్స్ రేలు, సిటీ స్కాన్లు తీయించుకోవాల్సిన అవసరం లేదు. ఐదు రోజుల తర్వాత వైద్యుల సూచలన ప్రకారం పరీక్షలు చేయించుకోవాలి.

రక్త పరీక్షల రిపోర్ట్ లను బట్టి చెస్ట్ ఎక్స్ రే లేదా సీటీ స్కాన్ చేయించుకోవాలో వద్దో నిర్ణయం తీసుకోవాలి. లక్షణాలు కనిపించిన వెంటనే పల్స్ ఆక్సీమీటర్ సహాయంతో తరచూ ఆక్సిజన్ లెవెల్స్ ను చెక్ చేసుకోవాలి. పల్స్ రేటు 120/మినిట్ తక్కువగా ఉన్నా ఆక్సిజన్ 94 శాతం కన్నా తక్కువగా ఉన్నా వెంటనే డాక్టర్ దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లాలి. ఆక్సిజన్ శాతం 93 కంటే తక్కువగా ఉంటే బెడ్ కోసం ప్రయత్నించాలి.

హోం ఐసోలేషన్ లో ఉన్నవాళ్లు సరైన ఆహారం తీసుకుంటే మాత్రమే కరోనాను జయించడం సాధ్యమవుతుంది. వీలైనంత సమయం విశ్రాంతి తీసుకుంటూ కనీసం 14 గంటలు నిద్రపోవడం వల్ల కరోనా నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. భయాందోళన చెందకుండా మందులు వాడితే కరోనాను సులభంగా జయించడం సాధ్యమవుతుంది.