మనలో చాలామంది డబ్బులు ఆదా చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే డబ్బులు ఆదా చేయడం సులువైన పని కాదనే సంగతి తెలిసిందే. ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నవాళ్లు మాత్రమే డబ్బులు సులుభంగా ఆదా చేయగలుగుతారు. డబ్బులు ఆదా చేయలనుకునే వారు స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కచ్చితమైన రాబడిని పొందే అవకాశం ఉంటుంది. ఇతర స్కీమ్ లతో పోలిస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.
దీర్ఘకాలంలో కళ్లు చెదిరే లాభం సొంతం చేసుకోవాలని అనుకునే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. రోజుకు రూ.150 చొప్పున ఆదా చేసి నెలకు రూ.4,500 పీపీఎఫ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా రూ.20 లక్షలు పొందే అవకాశం ఉంటుంది. ఏకంగా 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.20 లక్షలు పొందే అవకాశం అయితే ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించుకొని ఆదా చేసేవాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఈ స్కీమ్ లో దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అదనపు రాబడిని పొందే అవకాశం ఉంటుంది. 25 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు నెలకు 4,500 రూపాయల చొప్పున 45 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఇన్వెస్ట్ చేస్తే రూ.20 లక్షలు కచ్చితంగా వస్తాయని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు చెబుతున్నారు. కేవలం రూ.100తో పీపీఎఫ్ ఖాతా తెరిచే అవకాశం ఉండగా గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు కాగా 5 ఏళ్ల చొప్పున పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయి.