https://oktelugu.com/

ఆన్ లైన్ లో పిల్లల ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే..?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఆధార్ కార్డ్ తప్పనిసరి కాగా పిల్లల ఆధార్ కోసం ఆన్ లైన్ లో యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. బాల ఆధార్ కార్డ్ పేరుతో పిలవబడే ఈ కార్డ్ నీలం రంగులో ఉంటుంది. చిన్నపిల్లలకు వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు ఆధార్ కార్డుతో లింక్ చేయబడవు. పిల్లలకు 5 సంవత్సరాల వయస్సు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 6, 2021 / 08:06 AM IST
    Follow us on

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఆధార్ కార్డ్ తప్పనిసరి కాగా పిల్లల ఆధార్ కోసం ఆన్ లైన్ లో యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. బాల ఆధార్ కార్డ్ పేరుతో పిలవబడే ఈ కార్డ్ నీలం రంగులో ఉంటుంది. చిన్నపిల్లలకు వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు ఆధార్ కార్డుతో లింక్ చేయబడవు.

    పిల్లలకు 5 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత బయోమెట్రిక్స్ ను తల్లిదండ్రులు అప్ డేట్ చేయించాల్సి ఉంటుంది. బాల్ ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్లు మొదట https://uidai.gov.in/ వెబ్ సైట్ లో ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ లింక్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఫారమ్‌ నింపి బుక్ అపాయింట్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత రిజిస్ట్రేషన్ తేదీని, ఆధార్ కేంద్రాన్ని తల్లిదండ్రులు ఎంపిక చేసుకోవాలి.

    పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఫోటో కాపీలు, అన్ని పత్రాలతో పాటు రిఫరెన్స్ నంబర్ వివరాలతో ఆధార్ కేంద్రానికి వెళితే పిల్లల వయస్సును బట్టి బయోమెట్రిక్ వివరాలను తీసుకోవాలో వద్దో అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఆ తరువాత అధికారులు దరఖాస్తుదారునికి ఎకనాలెడ్జ్‌మెంట్ నంబర్‌ ను ఇస్తారు. ప్రకియ పూర్తైన 90 రోజుల్లో బాల్ ఆధార్ అడ్రస్ కు చేరుకుంటుంది.

    ఈ విధంగా సులభంగా బాల్ ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం సాధ్యమవుతుంది. బాల్ ఆధార్ కార్డుకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సంప్రదించి తెలుసుకోవచ్చు.