
మన దేశంలోని ప్రజలతో పాటు ఇతర దేశాలలోని ప్రజలను సైతం కరోనా వైరస్ గజగజా వణికిస్తుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరోనా బారిన పడిన వారిలో యువత వేగంగానే వైరస్ నుంచి కోలుకుంటున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు మాత్రం వైరస్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. అయితే కరోనా నుంచి కోలుకున్న వాళ్లను వ్యాక్సిన్ తీసుకోవచ్చా..? లేదా..? అనే సందేహం వెంటాడుతోంది.
అయితే కేంద్రం కరోనా నుంచి కోలుకున్న వాళ్లు వెంటనే వ్యాక్సిన్ ను తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతోంది.. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి నాలుగు వారాల నుంచి 8 వారాల వరకు కరోనా వ్యాక్సిన్ అవసరం లేదు. అయితే శరీరంలోని యాంటీబాడీలు కొందరిలో నెల రోజులు ఉంటే మరి కొందరిలో ఎక్కువ రోజులు ఉంటాయి.రెండు నెలల తర్వాత మాత్రం వ్యాక్సిన్ తీసుకున్నా ఏ సమస్య ఉండదు.
అమెరికాకు చెందిన వ్యాధుల నివారణ నియంత్రణ సంస్థ మాత్రం మూడు నెలల పాటు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందని కరోనా నెగిటివ్ వచ్చిన వాళ్లకు మూడు నెలలు వ్యాక్సిన్ అవసరం లేదని చెబుతుండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కరోనా నెగిటివ్ వచ్చిన వాళ్లకు ఆరు నెలలు వ్యాక్సిన్ అవసరం లేదని చెబుతుండటం గమనార్హం. అయితే వైద్యులు కరోనా నుంచి కోలుకున్న వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
కనీసం రెండు నెలలు జంక్ ఫుడ్ కు, మద్యానికి దూరంగా ఉంటే మంచిదని సూచనలు చేస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో ఏకీకృత నిబంధనలు లేకపోవడంతో కరోనా నెగిటివ్ వచ్చిన వాళ్లు రెండు నెలల తర్వాత వ్యాక్సిన్ ను తీసుకుంటే మంచిది.