మధుర క్షణాలను ఆస్వాదిస్తున్న ‘హరితేజ’ !

ఆడవారి జీవితంలో అత్యంత మధుర క్షణాలలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం మొదటిసారి తన బిడ్డను చేతుల్లోకి తీసుకుని ప్రేమగా కళ్ళలోకి చూసినప్పుడు కలిగే అనుభూతినే. తొమ్మిది నెలల పాటు తమ చిన్నారి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన జంటకు, ఆ ఆనంద క్షణం రానే వచ్చి.. తమ చిన్నారిని తమ చేతిల్లోకి తీసుకుని చూసుకుంటే ఈ లోకాన్నే మర్చిపోతారు ఆ జంట. ‘నటి’ హరితేజ జంట ప్రస్తుతం తమ జీవితంలో ఆ క్షణాల్నే ఆస్వాదిస్తున్నారు. ఇటీవలే హరితేజ […]

Written By: admin, Updated On : April 24, 2021 8:57 am
Follow us on

ఆడవారి జీవితంలో అత్యంత మధుర క్షణాలలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం మొదటిసారి తన బిడ్డను చేతుల్లోకి తీసుకుని ప్రేమగా కళ్ళలోకి చూసినప్పుడు కలిగే అనుభూతినే. తొమ్మిది నెలల పాటు తమ చిన్నారి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన జంటకు, ఆ ఆనంద క్షణం రానే వచ్చి.. తమ చిన్నారిని తమ చేతిల్లోకి తీసుకుని చూసుకుంటే ఈ లోకాన్నే మర్చిపోతారు ఆ జంట. ‘నటి’ హరితేజ జంట ప్రస్తుతం తమ జీవితంలో ఆ క్షణాల్నే ఆస్వాదిస్తున్నారు. ఇటీవలే హరితేజ పండంటి బిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తమ బుజ్జి పాపాయిని తన భర్త చేతుల్లోకి తీసుకొని అపురూపంగా చూసుకుంటున్న ఫోటోని తాజాగా హరితేజ తన ఫాలోవర్స్ కోసం పోస్ట్ చేసింది. తమ వెడ్డింగ్ యానివర్సరీకి స్పెషల్ గా దిగిన ఫోటో అట అది. ఇక తన బిడ్డ కోసం సినిమాలకు కొన్నాళ్లు పాటు బ్రేక్ ఇచ్చిన హరితేజ, మొత్తానికి ప్రస్తుతం తల్లిగా మధురమైన క్షణాలను ఎంజాయ్ చేస్తోంది. అన్నట్టు 30 ఏళ్ల హరితేజ ఆరేళ్ళ క్రితం దీపక్ అనే టెకీని పెళ్లి చేసుకొంది. వీరిది ప్రేమ వివాహాం. ఇక ప్రెగ్నన్ట్ గా ఉన్నప్పటి నుండే హరితేజ ఫోటోషూట్ లతో ఇన్ స్టాగ్రామ్ లో హడావిడి చేస్తూ వస్తోంది.

ఇక పై తన ముద్దుల కూతురు ఫొటోలతో హంగామా చేస్తుందేమో. ఇక తల్లిగా హరితేజ చాల జాగ్రత్తలు తీసుకుంటుందట. తల్లి ఎప్పుడూ తనకు ఆనందించే ఆహారాన్ని ఖచ్చితంగా తినాలి అని, అలాగే పాలిచ్చే తల్లికి ఆమె శ్రేయస్సుకు కచ్చితమైన వ్యాయామం ముఖ్యం అని.. తానూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నానని… ఇక మా పాపాయి చాల అల్లరి చేస్తోందని చెప్పుకొచ్చింది హరితేజ.