https://oktelugu.com/

ఆయుర్వేదంతో కరోనా వైరస్ కు చెక్.. పాటించాల్సిన పద్ధతులివే..?

భారత్ లో సెకండ్ వేవ్ లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా బారిన పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోగనిరోధక శక్తి లేనివాళ్లకు ఎక్కువగా కరోనా వైరస్ నిర్ధారణ అవుతోంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకుంటే కరోనా సోకినా త్వరగా కోలుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఆయుర్వేదంలో కొన్ని పద్ధతుల ద్వారా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకుని సులభంగా కరోనా నుంచి కోలుకోవచ్చు. ప్రకృతి నుంచి తయారుచేసే మంచి ఔషధాలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 30, 2021 10:12 am
    Follow us on

    భారత్ లో సెకండ్ వేవ్ లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా బారిన పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోగనిరోధక శక్తి లేనివాళ్లకు ఎక్కువగా కరోనా వైరస్ నిర్ధారణ అవుతోంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకుంటే కరోనా సోకినా త్వరగా కోలుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఆయుర్వేదంలో కొన్ని పద్ధతుల ద్వారా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకుని సులభంగా కరోనా నుంచి కోలుకోవచ్చు.

    ప్రకృతి నుంచి తయారుచేసే మంచి ఔషధాలు అయిన ఆయుష్క్వాత్, చ్యవన్‌ప్రష్, ఇతర మూలికా పదార్థాలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచఎడంలో ఎంతగానో సహాయపడతాయి. హానికరమైన ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా నుంచి రక్షించి శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. పసుపు పొడితో హెర్బల్ టీ, పాలు తాగినా ఇమ్యూనిటీ పవర్ ను సులభంగా పెంచుకోవచ్చు. ఆమ్లా జ్యూస్ తో కరోనాకు సులువుగా చెక్ పెట్టవచ్చు.

    సి విటమిన్ పుష్కలంగా ఉండే ఆమ్లా జ్యూస్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో తోడ్పడుతుంది. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంతో పాటు శరీరానికి అవసరమైన చురుకుదనం లభిస్తుంది. కరోనా బారిన పడిన వారిలో చాలామంది గొంతు నొప్పితో బాధపడుతున్నారు. పసుపు, ఉప్పు ఈ సమస్యలకు చెక్ పెట్టడంలో తోడ్పడతాయి.

    తులసి, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, సొంటి, ఎండుద్రాక్ష ఇమ్యూనిటీ పవర్ ను సులభంగా పెంచుతాయి. వీటిలో శరీరాన్ని ప్రభావితం చేసే హానికరమైన వైరస్‌లతో పోరాడే సామర్థ్యంతో పాటు ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి.